బెంగళూరు తొక్కిసలాట ఘటన దురదృష్టకరం: కిషన్‌రెడ్డి
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనకు పూర్తిగా కర్ణాటక ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమే కారణమని తెలిపారు.స్టేడియం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసి కూడా తగిన ఏర్పాట్లు చేయకపోవడం దారుణమని అన్నారు.గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి