ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత!
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క...
- ఉద్యోగులు ప్రజాప్రభుత్వంలో భాగస్వాములు. వారి డిమాండ్లపై సీఎం శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తూ మంత్రుల సబ్ కమిటీ, అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు.
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సహాచర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు , పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ సలహాదారు కేశవరావు గారు తదితరులతో కలిసి ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం అవ్వడం జరిగింది.
- క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై అధికారుల నివేదికను సమర్పించి, సానుకూల నిర్ణయం తీసుకుంటాం.
- పెండింగ్‌లో ఉన్న సమస్యలపై దీటైన పరిష్కారాలు తీసుకురావాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం. ఆదాయ, వ్యయాలపై సమీక్ష చేస్తూనే, ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటున్నాం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి