(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); ట్రైనీ ఐఏఎస్‌లు ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. - మల్లెలన్యూస్ ట్రైనీ ఐఏఎస్‌లు ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    4, జూన్ 2025, బుధవారం

    ట్రైనీ ఐఏఎస్‌లు ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.




     తెలంగాణ కేడర్‌కు చెందిన 2024 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్‌లు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన ముఖ్యమంత్రి గారు, బాధ్యతల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.


    ముఖ్యమంత్రి గారిని కలిసిన సౌరభ్ శర్మ (Saurabh Sharma), సలోని ఛబ్రా (Saloni Chhabra), హర్ష చౌధరి (Harsha Choudhary), కరోలిన్ చింగ్తియన్మావి (Carolyn Chingthianmawi), కొయ్యడ ప్రణయ్ కుమార్ (Koyyada Pranay Kumar) గార్లు ప్రస్తుతం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు.


    జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి గారి నివాసంలో జరిగిన ఈ భేటీలో సీఎం సలహాదారు వేం. నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గారు, Dr. MCRHRD వైస్-ఛైర్‌పర్సన్ శాంతి కుమారి గారు, కోర్సు డైరెక్టర్ ఉషారాణి గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ట్రైనీ ఐఏఎస్‌లు ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top