తిరుపతి రూరల్ మండలం పద్మావతిపురం పంచాయతీలో వైభవంగా గంగమ్మ జాతర.
గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.
ముందుగా పద్మావతిపురం పంచాయతీకి విచ్చేసిన పులివర్తి నాని గారికి ఘన స్వాగతం పలికిన మహిళలు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు.
పద్మావతిపురం పంచాయతీలోని ప్రజలు, సుఖ సంతోషాలతో, ఆయు ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు పులివర్తి నాని గారు తెలిపారు.
తిరుపతి,
చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం పద్మావతిపురం పంచాయతీలో వైభవంగా గంగమ్మ జాతరను పంచాయతీ ప్రజలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. జాతర సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు పట్టు వస్త్రాలతో ఊరేగింపుగా గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. ముందుగా పద్మావతిపురం పంచాయతీకి విచ్చేసిన పులివర్తి నాని గారికి ఘనంగా స్వాగతం పలికిన కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు. పులివర్తి నాని గారికి మహిళలు హారతులు పట్టి తిలకం దిద్ది శాలువతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం పద్మావతిపురం పంచాయతీలోని గంగమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి... ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.గంగమ్మ జాతరకు తరలివచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించిన పులివర్తి నాని గారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి