పూర్తిస్థాయి డీజీపీగా శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్ పదవీ బాధ్యతలు స్వీకరణ..
అమరావతి – మే 31, 2025: డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ హరీష్ కుమార్ గుప్తా . నేడు మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పోలీస్ దళాధిపతిగా పదవీ భాద్యతలు స్వీకరించారు. 1992 బ్యాచ్ IPS అధికారి అయిన హరీష్ కుమార్ గుప్తా విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ పోస్టులో కొనసాగుతూ ఇన్ ఛార్జి డీజీపీ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నేడు పదవీ భాద్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా డీజీపీగా నేటి నుంచి రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. గత నాలుగు నెలలుగా ఇన్ ఛార్జి డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన పోలీసుశాఖలో తనదైన ముద్ర వేశారు. ఈ ఏడాది జనవరిలో ద్వారకా తిరుమలరావు డీజీపిగా పదవీ విరమణ చేసిన తర్వాత మళ్లీ హరీష్ కుమార్ గుప్తాకే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇన్ ఛార్జిగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఇవాళ్టి నుంచి హరీష్ కుమార్ గుప్తా పూర్తిస్థాయి డీజీగా వ్యవహరించనున్నారు. డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తాను పలువురు సీనియర్ పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి