దాచేపల్లి మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
దాచేపల్లి మండలంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జనతా వారిది కార్యక్రమం నిర్వహించాము. జనతా వారధి కార్యక్రమంలో భాగంగా విద్యా సంవత్సరం 2026 - 27 కు సంబంధించి RTE ద్వారా 1వ తరగతి ప్రవేశానికి అప్లై చేస్తుండగా వెబ్ ఆప్షన్స్ లో పలు టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యల సంబంధించి దాచేపల్లి మండల విద్యాశాఖ వారి కార్యాలయ అధికారులకు వివరించి వారి ద్వారా జిల్లా విద్యాశాఖ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఈ RTE పాలసీకి కి సంబంధించిన సమస్యను అవకాశం ఉన్నంత త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాము. ఈనెల 10వ తారీకు తో ఆన్లైన్ అప్లికేషన్ గడువు కూడా ముగుస్తుంది. అప్లికేషన్ పెట్టుకోవడంలో సమస్యలు పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. టోల్ ఫ్రీ నెంబర్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది అవకాశం ఉండి కలిసిన సత్వరం పరిష్కరించుకుండ సంబంధిత వారికి ఇన్ఫామ్ చేస్తాము అంటున్నారు. సత్వర సమస్యలను పరిష్కరిస్తూ ఈ అవకాశం అందరూ వినియోగించుకునేలా చేయాలని కోరడమైనది.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ దాచేపల్లి మండల అధ్యక్షులు కొప్పల నాగేశ్వరరావు గారు, మాజీ అసెంబ్లీ కన్వీనర్ ఆర్య వెంకటేశ్వర్లు గారు పలువురు విద్యార్థి, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి