ఆస్తి.అధికారంపై వ్యామోహం.. తల్లీ, చెల్లెళ్లపై విద్వేషం, ఇదే జగన్ పాలసీ : ప్రత్తిపాటి
•ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం.. పరంధామునితో రాజకీయ క్రీడలాడుతూ జగన్..వైసీపీనేతలు ఘోరపాపానికి పాల్పడుతున్నారు : ప్రత్తిపాటి
“ ఆస్తిపాస్తుల్ని..అధికారాన్ని ప్రేమించాలి. తండ్రి వారసత్వంగా ఇచ్చిన సొమ్ములో వాటాలడిగే తల్లిని, చెల్లిని ద్వేషించాలి. బాబాయ్ హత్యతో లబ్ధిపొందాలి.. ఆయన బిడ్డను మాత్రం సూటిపోటి మాటలతో వేధించాలి. అన్నదే జగన్ పాలసీ. ఈ ప్రాథమిక సిద్ధాంతాలకు కట్టుబడ్డ జగన్ ఐదేళ్లపాటు ప్రజలను, రాష్ట్రాన్ని తాను ఉద్దరించినట్టు.. ఇప్పుడున్న ప్రజా ప్రభుత్వం అసలేమీ చేయనట్టు నమ్మబలకడం సిగ్గుచేటు. 95 శాతం ప్రజల మధ్ధతుతో భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన కూటమిప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమే జగన్ పనిగా పెట్టుకున్నాడు. చివరకు తన స్వార్థ, నీతిమాలిన రాజకీయాల కోసం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరునితో రాజకీయాలు చేసే దుస్థితికి దిగజారాడు. జగన్... వైసీపీనేతలు తమ కుట్ర రాజకీయాలకోసం ఆ పరంధామునితో పరాచకాలాడటం తక్షణమే మానుకోవాలి. లేకుంటే కాలం వారికి విధించే శిక్ష ఊహాకు కూడా అందదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సకుటుంబ సపరివారంతో స్వామి సేవలో తరిస్తూ.. భక్తుల యోగక్షేమాలు విచారిస్తుంటే... జగన్ తన క్రిమినల్ ముఠాతో, అవినీతి పరివారంతో వేంకటేశ్వరుని పవిత్రత.. తిరుమల ప్రతిష్ఠపై దుష్ప్పచారానికి తెగబడటం మహాపాతకమే అవుతుంది. కూటమి ప్రభుత్వ అభివృద్ధిని స్వాగతించకుండా... ప్రజలు మెచ్చే సంక్షేమాన్ని హర్షించకుండా, జన్మజన్మలకు సరిపోయేలా జగన్ .. వైసీపీనేతలు ఘోరపాపాలకు ఒడిగడుతున్నారు.” అని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి