గుంటూరు నగరాభివ్రుద్దికి అధికారులు ప్రజా ప్రతినిధుల సమన్వయంతో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలన మరియు పట్టణాభివ్రుద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పి. నారాయణ గారు నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఆయన ఛాంబర్ లో గుంటూరు మునిసిపల్ కార్పోరేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనుల పై రాష్ట్ర పురపాలన సంచాలకులు సంపత్ కుమార్, నగర కమిషనర్ కె. మయూర్ అశోక్, యం.యల్.ఏ లు మహమ్మద్ నసీర్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు మరియు నగర పాలక సంస్థ విభాగాదిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పురపాలన శాఖ మంత్రివర్యులు గుంటూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకొని, నియోజకవర్గాల వారీగా జరుగుతున్నఅభివృద్ధి పనుల పై సమీక్షించారు. నగర పాలక సంస్థ నిధుల వివరాలు అదిగి తెలుసుకొని, రానున్న కాలంలో నగర పాలక సంస్థ చేపట్టనున్న అభివృద్ధి పనులు, ప్రాజెక్ట్ లను క్షేత్ర స్తాయిలో వేగవంతం చేయాలన్నారు. నగరంలో మురుగు నీటి పారుదల మెరుగుదలకు అవసరమైన్ డ్రైన్ల నిర్మాణానికి ప్రభుత్వం నుండి అదనపు నిధులను కేటాయిస్తామన్నారు. వేసవి కాలం దృష్ట్యా త్రాగు నీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన రహదారులతో పాటు ఖాళీ స్తలాలు, పార్కులలో పచ్చదనం పెంపుకు ప్రణాలికాబద్దంగా ముందుకెల్లాలన్నారు. త్వరలో లబ్దిదారులకు అందించనున్న టిడ్కో ఇళ్ళు పూర్తి స్తాయిలో సిద్దం చేయడంతో పాటు, ఖాళీగా ఉన్న ప్లాట్లను అర్హులైన లబ్దిదారులకు కేటాయించుటకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో భవన నిర్మాణాల కొరకు దరఖాస్తు చేసుకున్న ఆర్జీలను, యల్.ఆర్.యస్ మరియు లే అవుట్ అనుమతుల దరఖాస్తులను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నగరాభివ్రుద్దికి రాష్ట్ర ప్రభుత్వం, నగర పాలక సంస్థ చేపట్టే చర్యలకు ప్రజా ప్రతినిధులు పూర్తి స్తాయిలో సహకరించాలని కోరారు.
సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ విభాగాధిపతులు, నగర పాలక సంస్థ విభాగాధిపతులు పాల్గొన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి