వైసీపీ ధర్మ రక్షణ గురించి మాట్లాడటం హాస్యాస్పదం!
*హిందూ ధర్మాన్ని భక్షించే వారే 'హిందూ ధర్మ రక్ష' అంటూ సాక్షి పత్రికలో ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదమని మంత్రి పార్థసారధి ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో హిందూ సంప్రదాయాలను ఏనాడూ గౌరవించలేదని, తిరుమల నెయ్యి కల్తీతో భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని విమర్శించారు. జగన్కు ఆలయాలకు వెళ్లడం మానేసి, ఇంట్లోనే సెట్టింగ్లు వేసి పూజలు చేస్తున్నట్లు నటించడం అలవాటని మండిపడ్డారు. ధర్మాన్ని అపహాస్యం చేసిన వారు ఇప్పుడు రక్షకులమని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని, గత ఐదేళ్లలో దేవాలయాలపై జరిగిన దాడులు, అపవిత్ర కార్యాలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.*
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి