ఉన్నం మృతి టీడీపీకి తీరని లోటు : ప్రత్తిపాటి
“ తెలుగుదేశం సీనియర్ నాయకులు. కల్యాణ దుర్గం మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి మృతి వార్త తెలిసి తీవ్ర వేదనకు గురయ్యాను. ఆయన మరణం పార్టీకి, స్థానిక టీడీపీ శ్రేణులకు, అభిమానులకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. హనుమంత రాయ చౌదరి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. సర్పంచ్ గా మొదలైన ఆయన రాజకీయ జీవితం అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా., శాసనసభ్యుడిగా సుదీర్థకాలం కొనసాగడం పార్టీకి గర్వకారణం.. టీడీపీ బలోపేతానికి హనుమంతరాయ చౌదరి చేసిన కృషి అనన్య
సామాన్యమైంది .” అని మాజీమంత్రి ప్రత్తిపాటిపుల్లారావు ఒక ప్రకటనలో తెలిపారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి