(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); బాపూజీ వృద్ధాశ్రమంలో అన్నదానంయషిక క్షేత్ర పుట్టినరోజు వేడుకలు - మల్లెలన్యూస్ బాపూజీ వృద్ధాశ్రమంలో అన్నదానంయషిక క్షేత్ర పుట్టినరోజు వేడుకలు - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    22, మార్చి 2026, ఆదివారం

    బాపూజీ వృద్ధాశ్రమంలో అన్నదానంయషిక క్షేత్ర పుట్టినరోజు వేడుకలు




    బాపూజీ వృద్ధాశ్రమంలో అన్నదానం
    యషిక క్షేత్ర పుట్టినరోజు వేడుకలు

    చిలకలూరిపేట:

    పట్టణానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోవిందు శంకర శ్రీనివాసన్ తన మనవరాలు యషిక క్షేత్ర పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా స్థానిక చీరాల రోడ్డులో ఉన్న బాపూజీ వృద్ధాశ్రమంలో ఘనంగా అన్నదానం నిర్వహించారు.
    ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆశ్రమంలోని వృద్ధులను గోవిందు శంకర శ్రీనివాసన్ స్వయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన మిత్రులతో కలిసి వృద్ధులకు స్వయంగా భోజనం వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుడు వెంకట సత్య సాయి కిరణ్ మరియు డాక్టర్ గోవిందు తేజస్విని దంపతుల కుమార్తె అయిన యషిక క్షేత్ర పుట్టినరోజును గౌరవ వృద్ధుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.వృద్ధుల ఆశీస్సులు చిన్నారి భవిష్యత్తుకు మేలుకలిగిస్తాయని, అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వృద్ధులందరూ యషిక క్షేత్రను ఆశీర్వదించాలని కోరారు.వృద్ధులను ఆదరించి అక్కున చేర్చుకుంటున్న బాపూజీ వృద్ధాశ్రమం నిర్వాహకులు మురికిపూడి ప్రసాద్, ఆరాధ్యుల రామకృష్ణలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
    ఈ కార్యక్రమంలో సీనియర్ ఎల్ఐసి ఏజెంట్ అల్లిమియా, షబ్బీర్, తోట లక్ష్మీనారాయణ, వట్టెం శ్రీనివాసరావు, నిమ్మల మురళీకృష్ణ తదితరులు పాల్గొని యషిక క్షేత్రకు శుభాకాంక్షలు తెలియజేశారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బాపూజీ వృద్ధాశ్రమంలో అన్నదానంయషిక క్షేత్ర పుట్టినరోజు వేడుకలు Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top