పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డ్వాక్రా మహిళల సమస్యలపై జనతా వారధి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ
పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇన్‌చార్జ్ డిఆర్ఓ గారికి డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం జనతా వారధి తరపున వినతిపత్రం సమర్పించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారి సూచనల మేరకు పల్నాడు జిల్లా జనతా వారధి టీం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో DWCRA / SHG సంఘాల పనితీరు, మహిళా సాధికారత, SERP & MEPMA వ్యవస్థల పనితీరు, ఆడిట్ల పారదర్శకతపై సమగ్ర సమీక్ష నిర్వహించి అవసరమైన సంస్కరణలు చేపట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
వినతిపత్రంలో ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా సంఘాలపై స్వతంత్ర సామాజిక ఆడిట్ నిర్వహించడం, ప్రతి సంఘానికి డిజిటల్ అకౌంటింగ్ మరియు పారదర్శక డ్యాష్‌బోర్డ్ ఏర్పాటు చేయడం, రుణ మంజూరులో జరిగే డిడక్షన్లు, బీమాలు, ఛార్జీల వివరాలను లిఖితపూర్వకంగా అందించడం తప్పనిసరి చేయడం, బలవంతపు బీమాలు మరియు అనధికార కమిషన్లపై విచారణ జరపడం, పొదుపు ఆధారిత వ్యవస్థను బలోపేతం చేయడం, మహిళలకు వ్యాపారాభివృద్ధి, బ్రాండింగ్, మార్కెట్ లింకేజీలు, ఈ-కామర్స్ అవకాశాలు కల్పించడం, ఆర్థిక అక్షరాస్యత మరియు డిజిటల్ లిటరసీపై ప్రత్యేక శిక్షణలు నిర్వహించడం వంటి పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
కేంద్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తున్నప్పటికీ, డ్వాక్రా వ్యవస్థ కేవలం రుణాల పంపిణీ వ్యవస్థగా మారకుండా, నిజమైన మహిళా సాధికారతకు దోహదపడే విధంగా SERP మరియు MEPMA సంస్థలు సమర్థవంతమైన పర్యవేక్షణ, పారదర్శక ఆడిట్లు నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా ఇన్‌చార్జ్ మరియు జనతా వారధి రాష్ట్ర టీం సభ్యులు కేతనబోయిన హనుమంతరావు, పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు బీజేపీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా మీడియా ఇన్‌చార్జ్ కోమటి వాసు, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి