చంద్రబాబు కృషికి ఇదే నిదర్శనం: కేంద్రమంతి కుమారస్వామి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వంటి దార్శనికుడు ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రశంసించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏర్పాటు చేయనున్న భారీ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం విశాఖపట్నం చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ..దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయబోతున్నామని, ఇది సీఎం చంద్రబాబు కృషి, చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో లక్సెంబర్గ్‌కు చెందిన ఆర్సెలార్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ కంపెనీలు సంయుక్తంగా ఈ భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం రూ.1,47,162 కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి. రెండు దశల్లో ప్లాంట్ నిర్మాణం జరగనుండగా, 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 60 నుంచి 65 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి