ఏపీలో టిడ్కో ఇల్లు రాని వారికి దరఖాస్తు సొమ్ము తిరిగి చెల్లింపు
*83,865 మందికి రూ.174 కోట్లు వెనక్కి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం
*త్వరలో లబ్దిదారులతో 1,00,875 టిడ్కో ఇళ్లకు గృహప్రవేశం*
అమరావతి మల్లెల న్యూస్
గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు డబ్బులు చెల్లించి, ఫ్లాట్ కేటాయింపులు జరగని వారికి వాళ్ల దరఖాస్తు సొమ్ము తిరిగి చెల్లించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో మొత్తం 83,865 మంది దరఖాస్తుదారులకు రూ.174 కోట్లు వెనక్కి ఇవ్వాలని స్పష్టం చేశారు.
అలాగే రాష్ట్రంలో నిర్మాణం పూర్తైన 1,00,875 టిడ్కో ఇళ్లను త్వరలోనే లబ్దిదారులకు అందించి, గృహప్రవేశాలు చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో పట్టణాభివృద్ధి శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి... అధికారులకు పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి