(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); జనసేనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి - మల్లెలన్యూస్ జనసేనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    8, మార్చి 2026, ఆదివారం

    జనసేనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి



    జనసేనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి
     
    - నెల్లూరు సిటీ 3 వ డివిజన్ లో ఉద్యమి కార్యక్రమం భాగంగా స్థానిక హిజ్రాలు పార్టీలో చేరిక
    - జనసేన నగర అధ్యక్షుడు సుజయ్‌బాబు
    - 3 వ డివిజన్ ఇంచార్జ్ బత్తల శ్రీకాంత్ ఆధ్వర్యం లో సాదరంగా ఆహ్వానించిన దుగ్గిశెట్టి

    నెల్లూరు :

    జనసేన పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్‌బాబు కోరారు. ఆదివారం 3వ డివిజన్‌లో జనసేన డివిజన్‌ ఇన్‌చార్జి బత్తల శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ రాజీవ్‌ గాంధీ కాలనీలో నివసిిస్తున్న 30 మంది హిజ్రాలు జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయాన్ని డివిజన్‌ ఇన్‌చార్జి శ్రీకాంత్‌ ... దీంతో సుజయ్‌బాబు 3వ డివిజన్‌ రాజీవ్‌ గాంధీ కాలనీలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారిచేత ఉద్యమి సభ్యత్వ నమోదు స్వీకరించారు. హిజ్రా నాయకురాలు సునంద ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరిన అనంతరం మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ పరిపాలనా విధానాలు నచ్చి పార్టీలో చేరామన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి పార్టీలో చేరడానికి ముందుకు వచ్చామన్నారు
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జనసేనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top