అమరావతి మల్లెల న్యూస్
*నాదెండ్ల మనోహర్,పౌర సరఫరాల శాఖ మంత్రి*
పైప్డ్ నేచురల్ గ్యాస్ వినియోగంపై మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
పట్టణాల్లో ప్రస్తుతం ఎల్ పీజీ గ్యాస్ వాడుతోన్న
వినియోగదారులకు పైప్డ్ నాచులర్ గ్యాస్ అందించేలా చర్యలు
దేశం లో తొలిసారిగా రాష్ట్రంలో ఎల్ పీజీ నుంచి పీఎన్ జీ కి మార్పిడి ని ప్రారంబిస్తున్నాం..
విజయవాడ ,గుంటూరు, తిరుపతి,నెల్లూరు, కాకినాడ, కర్నూలు నగరాల్లో వినియోగదారులకు పీఎన్ జీఅందుబాటులోకి తేవాలని నిర్ణయం..
పర్యావరణ హితమైన పైప్డ్ నేచరల్ గ్యాస్ ను ప్రజలు ఎక్కువగా వినియోగించేలా ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది..
తిరుమల,విజయవాడ దుర్గగుడి , శ్రీకాళహస్తి,అన్నవరం, సింహాచలం దేవాలయ్యాల్లో పైప్డ్ నేచులర్ గ్యాస్ కనెక్షన్లు తీసుకోవాలని నిర్ణయం.
అన్ని పట్టణాల్లో అన్నా క్యాంటీన్లలోనూ పీఎన్ జీ ఏర్పాటు చేయాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం..
ముందుగా పట్టణాల్లోని అపార్టుమెంట్లలో పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరా కు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం..
గత వైసీపీ ప్రభత్వం పీఎన్ జీ పై జీఎస్టీని 5 నుంచి 25 శాతానికి పెంచింది..
పట్టణాల్లో పీఎన్ జీ గ్యాస్ వినియోగదారులను పెంచేలా ,ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది..
పట్టణాల్లో దీపం పథకంలోని గ్యాస్ కనెక్షన్లను పీఎన్ జీ గ్యాస్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు..
దీపం పథకం కింద ఇచ్చే రూ.2400 ఆర్ధిక సాయాన్ని పైఎన్ జీ గ్యాస్ కు మారిన వారికి ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది..
పీఎన్ జీ కి మార్పిడి చేసుకున్న వారికి ఉచిత గ్యాస్ సరఫరా పథకం కింద 2 నెలలకు ఓ సారి లబ్దిదారులకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తాం..
పట్టణ ప్రాంతాల్లోని 6 గ్యాస్ సరఫరా సంస్ధలు అదనపు పైప్ లైన్లు వేసేలా ప్రభుత్వం ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం.
10 లక్షల ఎల్ పీ గ్యాస్ లను పీఎన్ జీ కనెక్షన్లకు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సీఎం ఆదేశించారు.
ఎల్ పీ జీ నుంచి పీఎన్ జీ కి మారితే ఆర్థికంగా 30 శాతం ఆదా అవుతుందని శాస్త్రీయంగా తేలింది..
రాబోయే రోజుల్లో ఎల్ పీజీ కనెక్షన్లను పీఎన్ జీ కి మారేలా పౌర సరఫరా శాఖ చర్యలు తీసుకుంటుంది..
సాధారణ వినియోగదారులకు ఎక్కడా గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేవు..
వాణిజ్య పరంగా వాడే వారికి కాస్త ఇబ్బందులు ఉన్నాయి..
వాణిజ్య పరంగా వినియోగించే గ్యాస్ కోటాను 10 నుంచి 20 శాతానికి కేంద్రం పెంచింది..
పాఠశాలలకు సెలవులు ఇచ్చాక వారికిచ్చే గ్యాస్ ను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తాం.
రాష్ట్రంలో రోజూ సరాసరి 2.70 లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం..
అంగన్ వాడీ కేంద్రాల్లో కేంద్ర సహకారంతో ఇప్పటికే 12 వేల ఇండక్షన్లు స్టౌవ్ లు ఇప్పటికే ఇచ్చాం.
సోలార్ ద్వారా వాడే ఇండక్షన్ స్టౌవ్ లు మరిన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం.
సీఎన్ జీ సిలిండర్లను ను బ్లాక్ మార్కెట్లో అమ్మితే కేసులు నమోదు సహా కఠిన చర్యలు తీసుకుంటున్నాం.
*సౌరబ్ గౌర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్*
*రాష్ట్రంలో ఎక్కడా సీఎన్ జీ గ్యాస్ సరఫరా కొరత లేదు..*
ఆధార్ కేవైసీ ఆధారంగా ప్రజలకు వెంటనే పీఎన్ జీ ఇచ్చేలా చర్యలు
ఎల్ పీజీ నుంచి పీఎన్ జీ కనెక్షన్లు సంఖ్య వేగంగా పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం....
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి