(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); ఏటీఎం నగదు డ్రా చేస్తున్నారా?.. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు తెలుసుకోండి - మల్లెలన్యూస్ ఏటీఎం నగదు డ్రా చేస్తున్నారా?.. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు తెలుసుకోండి - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    31, మార్చి 2026, మంగళవారం

    ఏటీఎం నగదు డ్రా చేస్తున్నారా?.. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు తెలుసుకోండి


    ఏటీఎం నగదు డ్రా చేస్తున్నారా?.. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు తెలుసుకోండి

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా 2026-27 ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ నిబంధనల్లో పలు కీలక మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. నగదు వినియోగాన్ని తగ్గించి, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో హెచ్‌డీఎఫ్‌సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) వంటి ప్రధాన బ్యాంకులు ఏటీఎం విత్‌డ్రా పరిమితులు, సేవా రుసుములను సవరించాయి.

    ఉచిత పరిధిలోకి యూపీఐ విత్‌డ్రాలు
    ఇప్పటివరకు ఏటీఎంలలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ ద్వారా నగదు తీసుకునే సదుపాయంపై ప్రత్యేక ఛార్జీలు ఉండేవి కావు. అయితే ఏప్రిల్ 1 నుంచి ఈ విధానంలో మార్పు రానుంది. యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణలను కూడా నెలవారీ ఉచిత ఏటీఎం లావాదేవీల కోటాలోనే చేర్చనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంకులు ప్రకటించాయి. ఖాతాదారులు తమకు నిర్దేశించిన ఉచిత పరిమితిని దాటితే, యూపీఐ ద్వారా చేసే ప్రతి విత్‌డ్రాపై రూ. 23తో పాటు అదనపు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా మెట్రో నగరాల్లో ఇతర బ్యాంక్ ఏటీఎంలలో 3, నాన్-మెట్రో నగరాల్లో 5 ఉచిత లావాదేవీలకు అవకాశం ఉన్న విషయం తెలిసిందే.

    పీఎన్‌బీ విత్‌డ్రా లిమిట్‌లో భారీ కోత
    పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) తమ డెబిట్ కార్డులపై రోజువారీ నగదు విత్‌డ్రా పరిమితిని భారీగా తగ్గించింది. ప్లాటినం, గోల్డ్, బిజినెస్ కార్డుల పరిమితిని రూ. 1,00,000 నుంచి రూ. 50,000కు తగ్గించారు. అదేవిధంగా, సెలెక్ట్, సిగ్నేచర్ కార్డుల పరిమితిని రూ. 1,50,000 నుంచి రూ. 75,000కు కుదించారు. అంటే, దాదాపు 50 శాతం మేర పరిమితుల్లో కోత విధించారు. మరోవైపు బంధన్ బ్యాంక్ కూడా పరిమితి మించిన లావాదేవీలపై రూ. 10 చొప్పున వసూలు చేయనున్నట్లు తెలిపింది.

    భద్రత పెంపు, డిజిటల్ ప్రోత్సాహం
    ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు ఓటీపీతో పాటు పిన్ లేదా బయోమెట్రిక్ వంటి రెండంచెల భద్రతను తప్పనిసరి చేశారు. నగదుపై ఆధారపడటాన్ని తగ్గించడం, బ్యాంకుల నిర్వహణ వ్యయాలను నియంత్రించడమే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశమని బ్యాంకింగ్ వర్గాలు వివరిస్తున్నాయి. వినియోగదారులు మారిన నిబంధనలను గమనించి, అనవసర ఛార్జీల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నాయి.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఏటీఎం నగదు డ్రా చేస్తున్నారా?.. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు తెలుసుకోండి Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top