పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంచార్జ్ డీఆర్ఓ గారికి రాష్ట్రంలో సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరిస్తున్న మానవ మలమూత్ర వ్యర్థాల (Fecal Sludge) అక్రమ డంపింగ్ నివారణ, FSTP/STP విస్తరణకు తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా జనతా వారధి తరపున వినతిపత్రం సమర్పణ
విషయం: రాష్ట్రంలో సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరిస్తున్న మానవ మలమూత్ర వ్యర్థాల (Fecal Sludge) అక్రమ డంపింగ్ నివారణ, FSTP/STP విస్తరణకు తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా వినతి.
భారతీయ జనతా పార్టీ "జనతా వారధి" కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటినీ సందర్శిస్తూ, ప్రజల సామూహిక మరియు సామాజిక సమస్యలను తెలుసుకుంటోంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయి పరిశీలనలో ఒక భయంకరమైన, అత్యంత ఆందోళనకరమైన నిజం మా దృష్టికి వచ్చింది.
రాష్ట్రంలో ప్రతిరోజూ ప్రైవేట్ మరియు మున్సిపల్ సక్షన్ వాహనాల ద్వారా వేల లీటర్ల మానవ మలమూత్ర వ్యర్థాలు (Fecal Sludge) సేకరించబడుతున్నాయి. అయితే, ఈ వ్యర్థాలు చివరకు ఎక్కడికి వెళ్తున్నాయి? అనే ప్రశ్నకు ప్రభుత్వం వద్ద పారదర్శకమైన సమాధానం లేదు.
రాష్ట్రంలో ఉన్న Fecal Sludge Treatment Plants (FSTP), Sewage Treatment Plants (STP) ల సామర్థ్యం, సేకరిస్తున్న వ్యర్థాల పరిమాణానికి ఏమాత్రం సరిపోవడం లేదు. ఫలితంగా, రాత్రి వేళల్లో ఈ ప్రమాదకర వ్యర్థాలను నదులు, చెరువులు, కాలువలు, సముద్ర తీరాలు మరియు జనావాసాలకు సమీపంలోని ఖాళీ స్థలాలలో అక్రమంగా (Illegal Dumping) కుమ్మరిస్తున్నారు. ఇది కేవలం పారిశుధ్య సమస్య కాదు, ఒక పెను ముప్పు!
ఈ అక్రమ డంపింగ్ వల్ల ప్రజారోగ్య సంక్షోభం (Public Health Crisis), భూగర్భ జలాల కాలుష్యం (Groundwater Pollution), పర్యావరణ విధ్వంసం (Environmental Destruction), మహమ్మారి అంటువ్యాధుల వ్యాప్తి (Outbreak of Epidemics), భవిష్యత్ తరాలకు పర్యావరణ ముప్పు (Ecological Threat) ఉంటుంది.
గతంలో గౌరవనీయ అటల్ బిహారీ వాజపేయి గారి ప్రభుత్వం మానవ మలమూత్రాలను చేతులతో ఎత్తే విధానానికి స్వస్తి పలికి సాంకేతికతను పరిచయం చేయగా, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారు NAMASTE Scheme మరియు Swachh Bharat Mission (Urban & Grameen) ద్వారా పారిశుధ్య కార్మికుల భద్రతకు, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. కానీ, క్షేత్రస్థాయి అధికారులు ఈ గైడ్‌లైన్స్‌ను పూర్తిగా గాలికొదిలేశారు. తక్షణమే ఈ క్రింది చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ కోరుచున్నది.
• జిల్లాల వారీగా ఉన్న FSTP, STP ల సంఖ్య, వాటి అసలు సామర్థ్యం వాస్తవికతను సమీక్షించాలి.
• GPS ట్రాకింగ్ (Real-time Monitoring) తో వ్యర్థాలను సేకరించే వాహనాలు పర్యవేక్షించాలి.
• కాలుష్య నియంత్రణ మండలి (PCB), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామీణాభివృద్ధి శాఖలతో ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి. ప్రతి మున్సిపాలిటీ /మండలానికి వ్యర్థాల శుద్ధి ఏర్పాటు కల్పించాలి
• "Biogas & Resource Recovery Policy" ని ప్రకటించాలి.
• రోజువారీగా ఎంత వ్యర్థం సేకరించబడింది, ఎంత శుద్ధి చేయబడింది అనే డేటాను డ్యాష్‌బోర్డ్‌లో ఉంచాలి.
ఈ తీవ్రమైన అంశంపై నిర్లక్ష్యం వహించకుండా అధికారులు తక్షణమే స్పందించాలని భారతీయ జనతా పార్టీ వినమ్రంగా కోరుచున్నది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి