పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంచార్జ్ డీఆర్ఓ గారికి ఆహార భద్రత అంశంపై చర్యలు తీసుకోవాలని జనతా వారధి తరపున వినతిపత్రం సమర్పణ
పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంచార్జ్ డీఆర్ఓ గారికి ఆహార భద్రత (Food Safety) అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని జనతా వారధి తరపున వినతిపత్రం సమర్పించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు పల్నాడు జిల్లా జనతా వారధి టీం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహార భద్రత వ్యవస్థ బలోపేతం, కల్తీ ఆహార నియంత్రణ, మాంసం దుకాణాల పర్యవేక్షణ, ఫుడ్ టెస్టింగ్ మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలపై ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు సురక్షితమైన మరియు నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కల్తీ పాలు, నాసిరకం ఆహార పదార్థాలు, అపరిశుభ్రమైన మాంసం విక్రయాలు, నాణ్యతలేని ప్యాకేజ్డ్ వాటర్ వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు అవసరమని పేర్కొన్నారు.
వినతిపత్రంలో ప్రధానంగా ఈ డిమాండ్లు చేశారు:
1. రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.
2. ప్రతి జిల్లాలో మినీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలి.
3. ఆహార వ్యాపార సంస్థల్లో QR ఆధారిత ఫుడ్ లైసెన్స్ డిస్‌ప్లే తప్పనిసరి చేయాలి.
4. హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం దుకాణాల్లో క్రమానుగత పరిశుభ్రత తనిఖీలు నిర్వహించాలి.
5. అక్రమ స్లాటర్ పాయింట్లను గుర్తించి చర్యలు తీసుకోవాలి.
6. పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీలలో ప్రత్యేక ఆహార తనిఖీలు చేపట్టాలి.
7. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
8. 24×7 ఫుడ్ సేఫ్టీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి.
9. శుభ్రమైన ఆహారం పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు, పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు, పల్నాడు జిల్లా మీడియా ఇన్‌చార్జి కోమటి వాసు గారు, నరసరావుపేట వన్ టౌన్ అధ్యక్షులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్యం రాష్ట్ర అభివృద్ధికి మూలస్తంభమని, ఆహార భద్రత అంశాన్ని అత్యవసరంగా పరిగణించి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని జనతా వారధి ప్రతినిధులు కోరారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి