*రాజ్యసభ సభ్యునిగా సాయినాథుని మొక్కులు చెల్లించుకున్నా: భాష్యం రామకృష్ణ*
• చిలకలూరిపేట పట్టణంలోని షిర్డీ సాయినాథుని మందిరంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రత్తిపాటి, భాష్యం.
• గురుపౌర్ణమి ప్రచార కరపత్రాలు ఆవిష్కరించి, భక్తులకు అన్నవితరణ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ.
• చిలకలూరిపేట ప్రజలతో నాకు ప్రత్యేక అనుబంధం : భాష్యం
• నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావం కలిగిన ప్రముఖ విద్యావేత్త రామకృష్ణకు టీడీపీ సముచిత స్థానం కల్పించింది : ప్రత్తిపాటి
నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణ కలిగిన భాష్యం విద్యాసంస్థల అధినేత, భాష్యం రామకృష్ణను రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా కూటమిప్రభుత్వం ప్రజాభిప్రాయానికి విలువనిచ్చిందని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
గురువారం ఆయన రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణతో కలిసి చిలకలూరిపేటలోని షిర్డీ సాయినాథుని మందిరంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఇరువురూ ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేసి, గురుపౌర్ణమి ప్రచార కార్యక్రమాల కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమాలు ముగిశాక ఎమ్మెల్యే, ఎంపీ విలేకరులతో మాట్లాడారు.
*రామకృష్ణ చేతల మనిషి : ప్రత్తిపాటి*
ప్రముఖ విద్యావేత్త భాష్యం రామకృష్ణను పెద్దల సభకు ఎంపిక చేయడం ద్వారా టీడీపీ సముచిత నిర్ణయం తీసుకుందని, ఆయన రాకతో పార్టీకి ప్రత్యేక గుర్తింపు, బలం చేకూరుతాయని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. రామకృష్ణ చేతల మనిషని, గతంలో తుపాను బాధితుల్ని ఆదుకోవడంలో ఆయనే తొలి అడుగు వేశారని ప్రత్తిపాటి చెప్పారు. తాను, రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కోటిరూపాయల ఆర్థిక సాయాన్ని తుపాను బాధితులకు అందించడం జరిగిందన్నారు. చిలకలూరిపేటపై రామకృష్ణకే ప్రత్యేక అభిమానముందని, ఇక్కడి ప్రజల్ని ఆయన తన మనుషులుగా చూస్తారని ప్రత్తిపాటి చెప్పారు.
*చిలకలూరిపేట ప్రజలతో నాకు ప్రత్యేక అనుబంధం : భాష్యం రామకృష్ణ*
రాజ్యసభకు ఎంపికైతే.. స్థానిక షిర్డీ సాయినాథుని మందిరంలో అన్నదానం చేయిస్తానని మొక్కుకున్నానని, నేడు ఎమ్మెల్యే ప్రత్తిపాటితో కలిసి ఆ మొక్కు తీర్చుకున్నానని రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గం, ప్రజలతో నాకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, ఎంపీగా ఎన్నికయ్యాక నాలుగుసార్లు నియోజకవర్గానికి రావడం జరిగిందని రామకృష్ణ చెప్పారు. సాయినాథుని ఆశీస్సులతో ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరగాలని, అమరావతి, పోలవరం నిర్మాణాలు వేగంగా పూర్తై, చంద్రబాబు అభివృద్ధి ఫలాలు త్వరలోనే ప్రజలకు అందాలని రామకృష్ణ ఆకాంక్షించారు.
కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, ఆలయ చైర్మన్ కరణం చల్లా విజయ్ కుమార్, ప్రత్తిపాటి ఫౌండేషన్ నిర్వాహకులు కంచర్ల శ్రీనివాసరావు, టీడీపీ నేతలు గట్టినేని రమేష్, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, ఆలయ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి