(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); తెలంగాణ పర్యాటక శాఖలో బయటపడ్డ అక్రమాలు - మల్లెలన్యూస్ తెలంగాణ పర్యాటక శాఖలో బయటపడ్డ అక్రమాలు - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    30, మార్చి 2026, సోమవారం

    తెలంగాణ పర్యాటక శాఖలో బయటపడ్డ అక్రమాలు



    తెలంగాణ పర్యాటక శాఖలో బయటపడ్డ అక్రమాలు

    ఏడాది కాలంలో బోటింగ్ రంగం ద్వారా రూ.1.48 కోట్లకు గండి

    తెలంగాణలోని 27 పర్యాటక కేంద్రాల్లో దాదాపు 99 బోట్లను నడిపిస్తున్న పర్యాటక శాఖ 

    2024లో బోటింగ్ ద్వారా రూ.14.60 కోట్ల ఆదాయం రాగా, 2025లో రూ.13.12 కోట్లకు పడిపోయిన ఆదాయం 

    హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, నాగార్జున సాగర్, లక్నవరం లాంటి ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ పెరుగుతున్నా ఒక్క ఏడాదిలో రూ.1.48 కోట్ల ఆదాయం పడిపోవడంతో పర్యాటక శాఖలో అవినీతి జరుగుతున్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు

    బోటింగ్ కేంద్రాల్లో ఇన్‌చార్జ్‌లు, మేనేజర్లు, సిబ్బందితో కుమ్మక్కయి, టిక్కెట్లు లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే తక్కువ ధరలకు బోటింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తింపు

    రూ.500 ఉన్న టికెట్‌ను, రూ.200కు టికెట్ లేకుండా బోట్లోకి అనుమతించడం, 10 ట్రిప్పులు తిరిగితే 8 ట్రిప్పులు తిరిగినట్లు చూపించి మిగతా 2 ట్రిప్పుల డబ్బులు తీసుకోవడం, ఒక్క ట్రిప్పుకు 3 లీటర్లు డీజిల్ అవసరం ఉండగా అదనంగా 2 లీటర్లు బిల్లులో రాయడం లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని గుర్తించిన ఉన్నతాధికారులు

    నాగార్జునసాగర్ బోటింగ్ కేంద్రంలో 
    ఇన్‌ఛార్జి ఏకంగా నకిలీ టికెట్ బుక్కునే ప్రింట్ చేసి, ప్రభుత్వానికి రావలసిన లక్షల ఆదాయం కొల్లగొట్టాడని, అతన్ని విధుల నుండి తొలగించిన అధికారులు

    ప్రతీ బోటింగ్ కేంద్రంలో ఇలాంటి అవినీతి జరుగుతుందని, మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటికైనా ఇలాంటి అక్రమార్కుల పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: తెలంగాణ పర్యాటక శాఖలో బయటపడ్డ అక్రమాలు Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top