రాజమండ్రి జిల్లాలో జరిగిన కల్తీ పాల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సుమోటోగా చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై చీఫ్ సెక్రటరీ, డీజీపీకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాలలోపు ఘటనకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణిస్తూ, భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. కల్తీ పాలు తాగిన 16 మంది మృతి చెందారు. పాలను నిల్వ చేసే ఫ్రిజర్‌లో ఇథిలీన్ గ్లైకాల్ అనే అత్యంత విషపూరిత రసాయనం కలవడం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. పాల వ్యాపారి ఎ. గణేశ్వరరావును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
27, మార్చి 2026, శుక్రవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి