(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); వాలంటీర్లు , గ్రామ సచివాలయాల వ్యవస్థతో సర్పంచ్ లు ఉత్సవ విగ్రహాలుగా మారారు. సర్పంచ్ లకు ఆ గ్రామాల్లో గౌరవం,విలువ పెంచాలి - మల్లెలన్యూస్ వాలంటీర్లు , గ్రామ సచివాలయాల వ్యవస్థతో సర్పంచ్ లు ఉత్సవ విగ్రహాలుగా మారారు. సర్పంచ్ లకు ఆ గ్రామాల్లో గౌరవం,విలువ పెంచాలి - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    4, మార్చి 2026, బుధవారం

    వాలంటీర్లు , గ్రామ సచివాలయాల వ్యవస్థతో సర్పంచ్ లు ఉత్సవ విగ్రహాలుగా మారారు. సర్పంచ్ లకు ఆ గ్రామాల్లో గౌరవం,విలువ పెంచాలి



    వాలంటీర్లు , గ్రామ సచివాలయాల వ్యవస్థతో సర్పంచ్ లు ఉత్సవ విగ్రహాలుగా మారారు. సర్పంచ్ లకు ఆ గ్రామాల్లో గౌరవం,విలువ పెంచాలి

    *మర్రి రాజశేఖర్*


    *నేడు జరిగిన శాసన మండలి సమావేశాల్లో సర్పంచుల విధులు - సచివాలయ ఉద్యోగుల విధుల గురించి  శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు మాట్లాడుతూ గడచిన ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ ఉండేది. ఈ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఈ రెండు వచ్చిన తర్వాత గ్రామపంచాయతీ లలో చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ అధికారాలు మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయాయి. సర్పంచ్ అనేవారు ఒక ఉత్సవ విగ్రహంగా అయిపోయారు. ఆ గ్రామ సర్పంచ్ అసలు ఆ గ్రామంలో ఉన్నాడో లేదో కూడా తెలుసుకునే పరిస్థితి లేదు. ఈ సర్పంచ్, గ్రామపంచాయతీ వ్యవస్థ తీసుకొచ్చిన ఉద్దేశాన్ని  మిత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. గ్రామాల్లో నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలి అని గ్రామపంచాయతీ వ్యవస్థను లో రిజర్వేషన్లు పెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్లో ఉన్నవారు సర్పంచ్ లుగా గెలిచి గ్రామ పరిపాలన చేసేటటువంటి అవకాశం కల్పించింది మన రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వ్యవస్థని గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా నిర్వీర్యం చేయడం జరిగింది. గ్రామ సర్పంచ్ ని కలిసి మాకు ఈ పని కావాలి అని అడిగేవాడు లేడు*

    *వాలంటీర్లు అందరూ కూడా మండల పరిషత్ అధికారుల ఆధ్వర్యంలో ఉండేవాళ్ళు అక్కడ వాళ్ళు ఏమి చెబుతారో ఇక్కడ అదే చేయడం జరిగింది. సర్పంచ్ లను పూర్తిగా పక్కన పెట్టారు. పంచాయతీలకు వచ్చేటటువంటి నిధులు కూడా మరియు ఆర్థిక సంఘం నిధులు రాకుండా మొత్తం కూడా ప్రభుత్వమే వాడుకోవడం జరిగింది. సర్పంచు ఏమైనా లైట్లు వేయించినా, నీళ్లు పెట్టించినా, మంచినీరు ఇచ్చినా కూడా ఆ బిల్లులు కూడా రానటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం.*

    *ఇప్పుడు కొంత మెరుగుపడిన మాట వాస్తవం. ఆర్థిక సంఘం నిధులు డైరెక్ట్ గా సర్పంచు లకు వస్తున్నాయి. ఇక్కడ ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత సర్పంచ్ విధులు ఏంటి, సచివాలయ వ్యవస్థ యొక్క అధికారుల విధులు ఏంటి వాళ్లకి వీళ్ళకి అనుసంధానం ఏర్పరచాలి. సర్పంచి యొక్క గౌరవాన్ని పెంచి, సర్పంచి కి గ్రామంలో విలువ పెంచాలి. సర్పంచ్ కి ఆ గ్రామంలో ఏమేం కావాలో, ఏ పని చేస్తే ఆ గ్రామ అభివృద్ధి చెందుతుందో, ఆ సర్పంచ్ ఆ ఊరి వారు కాబట్టి వారికి అవగాహన ఉంటుంది. ప్రజల యొక్క సమస్యలపై సర్పంచ్ కి, ఆ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకి తెలిసినంతగా మిగిలిన వారికి తెలిసే అవకాశం లేదు. ఆ గ్రామంలో పనిచేసే అధికారులు బయట నుండి వచ్చిన వారే కానీ ఆ గ్రామస్తులు కారు. కాబట్టి సర్పంచ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకో కోవాలని గౌరవ మంత్రివర్యులను కోరిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు...*
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వాలంటీర్లు , గ్రామ సచివాలయాల వ్యవస్థతో సర్పంచ్ లు ఉత్సవ విగ్రహాలుగా మారారు. సర్పంచ్ లకు ఆ గ్రామాల్లో గౌరవం,విలువ పెంచాలి Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top