(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); రెండవ రోజు మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు మల్లెల శివ నాగేశ్వరరావు - మల్లెలన్యూస్ రెండవ రోజు మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు మల్లెల శివ నాగేశ్వరరావు - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    21, అక్టోబర్ 2026, బుధవారం

    రెండవ రోజు మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు మల్లెల శివ నాగేశ్వరరావు





     రెండవ రోజు మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు మల్లెల శివ నాగేశ్వరరావు 

    *ప్రజాస్వామ్య  ప్రక్రియను నీరుగార్చాలన్న లక్ష్యంతోనే వైసీపీ ‘సుప్రీం’ మార్గదర్శకాలకు వక్రభాష్యాలు చెబుతోంది:  ప్రత్తిపాటి*

    • ‘సుప్రీం’ సూచనల్ని తమకు అనుకూలంగా మార్చివేసి, అవినీతి మీడియాలో వైసీపీ దుష్ప్రచారానికి తెరలేపింది.
    • వైసీపీయే తమ అభ్యర్థుల్ని అడ్డుకొని ఆ నేరాన్ని కూటమికి ఆపాదిస్తోంది.
    • ప్రజలకు మేలు చేయాలన్న సదుద్దేశంతోనే కూటమి అభ్యర్థులు పోటీలో నిలిచారు.
    • 47, 48 వార్డుల్లో ప్రచారంలో పాల్గొన్న ప్రత్తిపాటి, కూటమి ఛైర్ పర్సన్ అభ్యర్థి తోట రాజరాజేశ్వరి.

    ఎన్నికల ప్రక్రియను నీరుగార్చాలన్న ఏకైక లక్ష్యంతో వైసీపీ పనిచేస్తోందని,  మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో 19 స్థానాల్లో నెలకొన్న చిన్నచిన్న సంఘటనలపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని వక్రీకరిస్తోందని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. 
    బుధవారం ఆయన కూటమి శ్రేణులు, మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థి శ్రీమతి తోట రాజరాజేశ్వరి, జనసేన ఇన్ ఛార్జ్ తోట రాజారమేశ్ తో కలిసి 47వ వార్డు, 48వ వార్డులో ప్రచారం నిర్వహించారు.  ఇంటింటికీ వెళ్లి 47వ వార్డు అభ్యర్థి ఏలూరి తిరుపతయ్య, 48వ వార్డు అభ్యర్థి షేక్ కరిముల్లా కూటమి అభ్యర్థుల్ని ప్రజలకు పరిచయం చేసిన ప్రత్తిపాటి, వారిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
    పట్టణంలోని అన్నివార్డుల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే, మున్పిపాలిటీ రూపురేఖలే మారిపోతాయని, ప్రజల అవసరమైన అభివృద్ధి సకాలంలో సాధ్యమవుతుందని ప్రత్తిపాటి తెలిపారు. మూడు పార్టీలు సరైన అభ్యర్థుల్ని ఎంపిక చేశాయని, ప్రతి ఒక్కరూ ప్రజలకు మేలు చేయాలన్న సదుద్దేశంతోనే ఎన్నికల బరిలో  నిలిచారన్నారు. 

    *తమ పార్టీ అభ్యర్థుల్ని వైసీపీయే అడ్డుకొని ఆ తప్పును కూటమికి ఆపాదిస్తోంది..*
    ఉమ్మడి కడప జిల్లా సహా, రాష్ట్రంలో రాయచోటి, పుంగనూరు సహా పలుచోట్ల వైసీపీ ఒక పథకం ప్రకారమే హింసకు పాల్పడిందని, తమ అభ్యర్థులను వైసీపీ నేతలే అడ్డుకొని, నామినేషన్ పత్రాలు చించేసి, ఆ చర్యలను కూటమి అభ్యర్థులు, పోలీసులు, అధికారులకు ఆపాదించే ప్రయత్నం చేశారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. నేడు వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును జగన్ అవినీతి మీడియా సాక్షి చిలువలు పలువలుగా చిత్రీకరిస్తూ, కూటమి ప్రభుత్వంపై బురదజల్లడం సిగ్గుచేటని ప్రత్తిపాటి అసహనం వ్యక్తం చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల ప్రక్రియను నిలిపివేయమని ఎక్కడా చెప్పలేదని, శాంతిభద్రతల సమస్యను సాకుగా చూపి నామినేషన్లు వేయలేకపోయామని కోర్టును ఆశ్రయించిన అభ్యర్థుల అభ్యర్థనను పరిశీలించాలని మాత్రమే ఎన్నికల సంఘానికి సూచించిందన్నారు. సుప్రీం ఇచ్చిన సాధారణ సూచనలకు ...వైసీపీ అనుకూల మీడియా, ఆపార్టీనేతలు వక్రభాష్యాలు చెబుతూ, కూటమిప్రభుత్వంపై నిందలు వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ప్రత్తిపాటి పేర్కొన్నారు.

    కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజరమేష్, టీడీపీ నియోజకవర్గ అబ్జార్వార్ ఆడక స్వాములు, సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, జనసేన నాయకులు మునీర్ హాసన్, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, నెల్లూరి రంజిత్, టీడీపీ నాయకులు బాజీ, ఆరే మల్లి, సుభాని, సురేష్, సుభాని, జహంగీర్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రెండవ రోజు మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు మల్లెల శివ నాగేశ్వరరావు Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top