సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సామజిక సమరసత సంయోజక్ పోలూరి శ్యాంమోహన్ రావు కు ఘన సన్మానం
సనాతన ధర్మం – భారతీయ సంస్కృతి – సంప్రదాయ కళల పరిరక్షణే మా లక్ష్యం
సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సామజిక సమరసత సంయోజిక్ గుంటూరు పోలూరి శ్యాంమోహన్ రావు గారిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ నెల్లూరి ఈశ్వర్ రంజిత్, సంస్థ కార్యదర్శి సింగరేసు పోలయ్య కలిసి పోలూరి పాండురంగరావు గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ భేటీలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ సేవా, ధార్మిక కార్యక్రమాల గురించి ఆయనకు వివరించారు. అనంతరం సంస్థ తరఫున ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి గౌరవించారు.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, సనాతన ధర్మ పరిరక్షణ, భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ, సంప్రదాయ కళలకు ప్రోత్సాహం అందించడం, ఆధ్యాత్మిక విలువలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం తమ సంస్థ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సమాజంలో సనాతన ధర్మంపై అవగాహన పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి
సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయం – భారతీయ సంస్కృతి పరిరక్షణే లక్ష్యం.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి