(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించాలని భారీ ర్యాలీ - మల్లెలన్యూస్ ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించాలని భారీ ర్యాలీ - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    6, అక్టోబర్ 2026, మంగళవారం

    ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించాలని భారీ ర్యాలీ




    ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించాలని భారీ ర్యాలీ

    కళ్యాణదుర్గంలో కదం తొక్కిన ఆశా వర్కర్లు

    సీఐటీయూ ఆధ్వర్యంలో మానవహారం అనంతరం ఎమ్మెల్యే కార్యాలయం వరకు ర్యాలీ

    ఎమ్మెల్యే కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేత

    కళ్యాణదుర్గం: ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కళ్యాణదుర్గం పట్టణంలో మంగళవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వందలాది మంది ఆశా వర్కర్లు తరలివచ్చారు.

    ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాళ్లు సుజాత, కళావతి, సువర్ణ, నాగమణి, పురుషోత్తమ్మ తదితరుల ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయ ఆవరణ నుంచి ప్రధాన రహదారి మీదుగా ర్యాలీ నిర్వహించారు. టీ సర్కిల్ వద్ద మానవహారం చేపట్టి తమ డిమాండ్లకు అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు ప్రజావేదిక వద్దకు చేరుకున్నారు.

    ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ.. ప్రస్తుతం వస్తున్న వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా లేవని, కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య శాఖలో సుమారు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు సరైన సెలవులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వేసవి సెలవులు మినహా ఇతర అన్ని రకాల సెలవులు వర్తింపజేయాలని కోరారు.

    ప్రస్తుతం అందుతున్న సుమారు రూ.10 వేల వేతనంలోనే పీహెచ్‌సీలు, ఆసుపత్రులకు వెళ్లేందుకు నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధం లేని పనులు అప్పగించడం, జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల నియామకాలు చేపట్టకపోవడం వల్ల పని ఒత్తిడి పెరుగుతోందన్నారు.

    ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేసి పర్మినెంట్ చేయాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా వర్కర్లుగా మార్చాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. దహన సంస్కారాల ఖర్చులు చెల్లించాలని, ఆశా వర్కర్ల నియామకాలను ప్రభుత్వమే చేపట్టాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

    పీఎస్సీకి వెళ్లే ప్రతి సందర్భంలో టీఏ, డీఏ సౌకర్యం కల్పించాలని, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం శిక్షణ పొందిన ఆశా వర్కర్లకు పర్మినెంట్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రూ.10 లక్షల బీమా సౌకర్యం, నాణ్యమైన మొబైల్ ఫోన్లు, యూనిఫామ్స్, గ్రాట్యుటీ సీలింగ్ ఎత్తివేత వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

    అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ నాయకుడు ధర్మతేజకు అందజేశారు.

    ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు మారక్క, అలివేలమ్మ, ప్రభావతి, మరియమ్మ, హెచ్. లక్ష్మీదేవితో పాటు వందలాది మంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించాలని భారీ ర్యాలీ Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top