(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); పట్టణంలో నిత్యం అభివృద్ధి పండగే : ప్రత్తిపాటి - మల్లెలన్యూస్ పట్టణంలో నిత్యం అభివృద్ధి పండగే : ప్రత్తిపాటి - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    10, అక్టోబర్ 2026, శనివారం

    పట్టణంలో నిత్యం అభివృద్ధి పండగే : ప్రత్తిపాటి



    పట్టణంలో నిత్యం అభివృద్ధి పండగే :  ప్రత్తిపాటి

    • ప్రజలు ఆశ్చర్యపోయేలా చిలకలూరిపేట పట్టణ ప్రగతి
    • రూ. 80 లక్షలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రత్తిపాటి.

    కూటమి పాలనలో పట్టణంలో నిత్యం అభివృద్ధి పండగేనని, అన్నివార్డుల్లో ప్రజలు ఆశ్చర్యపోయేలా రోడ్లు, డ్రైనేజ్ ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

    శనివారం ఆయన పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పలు వార్డుల్లో రూ.80 లక్షలతో చేపట్టే వివిధరకాల అభివృద్ధి పనులకు ప్రత్తిపాటి శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా ప్రత్తిపాటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 

    *మున్సిపాలిటీల అభివృద్ధితో ప్రజల జీవనప్రమాణాలు మెరుగవుతాయి.*
    ప్రజలు ఆశ్చర్యపోయేలా చిలకలూరిపేట పట్టణం ప్రగతి దిశగా సాగుతోందని, ఇకపై మున్సిపాలిటీలో ఎలాంటి  సమస్యలు ఉండవని ప్రత్తిపాటి చెప్పారు.  స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన రోడ్లు.. డ్రైనేజ్ లు,  ప్రజారోగ్య పరిరక్షణలో భాగమైన పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు.. పట్టణ యువతకు ఉత్తమమైన ఉపాధి అవకాశాల పెంపుపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. స్వచ్ఛత-శుభ్రతలో భాగంగా ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని, స్వచ్ఛాంధ్ర : స్వర్ణాంధ్ర లక్ష్యసాధనకు సహకరించాలని ప్రత్తిపాటి సూచించారు. చిన్న పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందాలంటే, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల్లో ప్రజల భాగస్వామ్యం, ప్రోత్సాహం ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు. మున్సిపాలిటీల అభివృద్ధితో స్థానికుల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే గాక,  ఉపాధి అవకాశాలు పెరుగుదలతో ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. 

    *ప్రత్తిపాటి శంకుస్థాపన చేసిన పలు అభివృద్ధి పనుల వివరాలు...*
    22వ వార్డు గాంధీపేట మున్సిపల్ ప్రైమరీ స్కూల్ వద్ద రూ.13 లక్షలతో వేయనున్న సీసీరోడ్డు.
    24వ వార్డు సుబ్బయ్య తోట, బోస్ రోడ్డు  సమీపంలో రూ.13 లక్షలతో వేయాల్సిన సీసీరోడ్డు. 
    28వ వార్డులోని మైనారిటీ ఖబరిస్తాన్ వద్ద రూ.17లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు మరియు ప్రహరీ నిర్మాణం.
    29వ వార్డు మున్సిపల్ ఉర్దూ స్కూల్ వద్ద రూ.6 లక్షలతో నిర్మించే CC రోడ్డు, డ్రైన్ల నిర్మాణ పనులు.
    37వ వార్డు నాలుగో లైన్లో రూ.8 లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్డు
    37వ వార్డు విజయ డిజిటల్ వద్ద రూ.8 లక్షలతో నిర్మించే మరో సీసీ రోడ్డు.
    38వ వార్డు వైఎస్సార్ కాలనీ సమీపాన రూ.15 లక్షలతో వీధిదీపాల ఏర్పాటు.

    శంకుస్థాపన కార్యక్రమాల్లో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ తేళ్ల సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, టీడీపీ నాయకులు మద్దిబోయిన శివ, ముల్లా కరిముల్లా, షేక్ మస్తాన్ వలి, కొత్త కోటేశ్వరరావు, పిల్లి కోటేశ్వరరావు, 
    గోపిదేశి శివ, బ్రహ్మం, మస్తాన్ వలి, మసాలా సాంబయ్య, పోతురాజు, బాబావలి, కరిముల్లా, షేక్ కరిముల్లా, షేక్ సుభాని బుజ్జి, తలమాల విజయ్, పఠాన్ ఇమ్రాన్ ఖాన్, షేక్ బాని, నందం చంద్రశేఖర్, కరిముల్లా, కాలేశా, బేరింగ్ మౌలాలి , తోట బ్రాహ్మస్వాములు, జున్ను బుడే, జంగా వినాయకరావు, సుజాత, యదాల సుజాత, అరెకట్ల భూలక్ష్మి, తుబాటి మధు, పాములపాటి శివకుమారి, తుబాటి శ్రీహరి, మధు, తొండపు వెంకయ్య, కరణం విజయ, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పట్టణంలో నిత్యం అభివృద్ధి పండగే : ప్రత్తిపాటి Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top