(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); చిరుమామిళ్లలో విద్యార్థులకు క్రీడా వసతులు - మల్లెలన్యూస్ చిరుమామిళ్లలో విద్యార్థులకు క్రీడా వసతులు - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    6, అక్టోబర్ 2026, మంగళవారం

    చిరుమామిళ్లలో విద్యార్థులకు క్రీడా వసతులు

     



    చిరుమామిళ్లలో విద్యార్థులకు క్రీడా వసతులు

    నూతన రన్నింగ్ ట్రాక్‌ను ప్రారంభించిన కలెక్టర్ కృతిక శుక్ల

    పల్నాడు జిల్లా చిరుమామిళ్లలోని శ్రీ నడికట్టు రామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ రన్నింగ్ ట్రాక్‌ను జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ప్రారంభించారు.

    విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ రన్నింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు.

    ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని పిలుపునిచ్చారు. చిన్ననాటి నుంచే క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు.

    పాఠశాలల్లో క్రీడా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న ఆమె.. విద్యార్థులు నూతన రన్నింగ్ ట్రాక్‌ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించాలని ఆకాంక్షించారు.

    ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: చిరుమామిళ్లలో విద్యార్థులకు క్రీడా వసతులు Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top