• సోలార్ పవర్ తో పర్యావరణ హితం, ప్రజలకు లబ్ధి
• సేవా సేతు అభియాన్-సూర్యఘర్ యోజన అవగాహనా సదస్సులో ఎమ్మెల్యే ప్రత్తిపాటి.
పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రజలు విరివిగా సద్వినియోగం చేసుకోవాలని, విద్యుత్ బిల్లుల నుంచి ఉపశమనం పొందాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.
గురువారం పట్టణంలోని వెంకటేష్ గ్రాండ్ హోటల్లో నిర్వహించిన ‘సేవాసేతు అభియాన్ – ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన’ అవగాహనా సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రత్తిపాటి... సూర్యఘర్ పథకం అమలు, విధివిధానాలపై అధికారులు, బ్యాంకుల ప్రతినిధులతో చర్చించిన అనంతరం, సదస్సుని ఉద్దేశించి మాట్లాడారు.
సూర్యఘర్ పథకం గృహ విద్యుత్ వినియోగదారులకు వరమని, కేంద్ర ప్రభుత్వ రాయితీలతో పాటు, విద్యుత్ బిల్లుల నుంచి వారికి ఉపశమనం లభిస్తుందని ప్రత్తిపాటి తెలిపారు. చిలకలూరిపేట ప్రజలు సూర్య ఘర్ పథకాన్ని వీలైనంత త్వరగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పర్యావరణ హితమైన సోలార్ పవర్ ప్యానెళ్ల వాడకంతో ప్రజలకు ఎనలేని మేలు కలుగుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేలా, విద్యుత్ లోటు లేకుండా ప్రభుత్వం ఇప్పటికే అన్నిచర్యలు చేపట్టిందని ప్రత్తిపాటి తెలిపారు.
కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, టీడీపీ నాయకులు మద్దిబోయిన శివ, ముల్లా కరిముల్లా, కొత్త కోటేశ్వరరావు, పిల్లి కోటేశ్వరరావు, ఎలక్ట్రికల్ ఎస్.సి. సుధాకర్ , డి.ఈ ఏడుకొండలు, ఏ.డి. భార్గవి అధికారులు, బ్యాంకర్లు, తదితరులు పాల్గొన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి