(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సంబంధించి వినతి పత్రం సమర్పించడం జరిగింది - మల్లెలన్యూస్ పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సంబంధించి వినతి పత్రం సమర్పించడం జరిగింది - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    27, జులై 2026, సోమవారం

    పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సంబంధించి వినతి పత్రం సమర్పించడం జరిగింది



    జనతా వారిది కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సంబంధించి వినతి పత్రం సమర్పించడం జరిగింది 

     ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఎస్సీ మోర్చా పల్నాడు జిల్లా కార్యదర్శి యేసు రత్నం నరసరావుపేట బిజెపి నాయకులు సంపత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు 

    నరసరావుపేట 
    మున్సిపల్ కమిషనర్ గారికి
    నరసరావుపేట పల్నాడు జిల్లా 

    విషయం: అక్రమ నిర్మాణాల నియంత్రణ, టౌన్ ప్లానింగ్ వ్యవస్థలో పారదర్శకత, అవినీతి నిర్మూలన మరియు ప్రజలకు న్యాయమైన క్రమబద్ధీకరణ విధానం అమలు చేయవలెనని వినతి.

    మహోదయులకు,

    భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న "జనతా వారధి" కార్యక్రమంలో ప్రజల నుండి అనేక వినతులు, ఫిర్యాదులు అందుతున్నాయి.

    ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరియు పట్టణ ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలు, టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరు, భవన నిర్మాణ అనుమతులు (Building Permissions), Building Penalization Scheme (BPS) అమలు విధానాలపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    ప్రజలు ప్రధానంగా ఈ క్రింది సమస్యలను మా దృష్టికి తీసుకువచ్చారు:

    - భవన నిర్మాణ అనుమతులు పొందే ప్రక్రియలో ప్రభుత్వ రుసుములతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.
    - నిర్మాణం జరుగుతున్న సమయంలో తనిఖీలు నిర్వహించాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు విధులను సక్రమంగా నిర్వహించడం లేదని, అనేక అక్రమ నిర్మాణాలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
    - "కాంపౌండింగ్ ఆఫ్ డివియేషన్" విధానాన్ని సమయానుకూలంగా అమలు చేయకుండా, భవనం పూర్తయిన తర్వాత మాత్రమే నోటీసులు జారీ చేసి, అనంతరం BPS పేరిట భారీ రుసుములు, జరిమానాలు విధించడం వల్ల ప్రజలు అనవసరంగా మూడు దశల్లో ఆర్థిక భారం భరించాల్సి వస్తోందని తెలియజేస్తున్నారు.
    - విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు లేకుండా, మొత్తం బాధ్యతను కేవలం పౌరులపై మోపడం న్యాయసమ్మతం కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
    - చిన్న స్వీయ నివాస గృహ యజమానులు మరియు ఉద్దేశపూర్వకంగా భారీ వాణిజ్య అక్రమ నిర్మాణాలు చేసిన వారిని ఒకే విధంగా పరిగణించడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    ప్రజల నుండి అందిన ఫిర్యాదులను పరిశీలించి, వివిధ ప్రాంతాలలో పర్యటించి పరిస్థితులను తెలుసుకున్న నేపథ్యంలో, ఈ క్రింది చర్యలు చేపట్టవలసిందిగా మనవి చేస్తున్నాము:

    1. టౌన్ ప్లానింగ్ వ్యవస్థపై స్వతంత్ర ఉన్నతస్థాయి విచారణ లేదా ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలి.
    2. విధి నిర్వహణలో నిర్లక్ష్యం లేదా అవినీతికి పాల్పడిన అధికారులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
    3. భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్, పారదర్శకంగా మరియు నిర్దిష్ట గడువులో అమలు చేయాలి.
    4. ప్రతి నిర్మాణానికి దశలవారీ డిజిటల్ తనిఖీలు, జియో-ట్యాగింగ్, ఫోటో ఆధారిత పర్యవేక్షణను తప్పనిసరి చేయాలి.
    5. చిన్న, స్వీయ నివాస గృహాలకు సరళమైన, ప్రజానుకూల, తక్కువ రుసుముతో క్రమబద్ధీకరణ విధానాన్ని రూపొందించాలి.
    6. భారీ వాణిజ్య అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, రోడ్లు ఆక్రమించిన నిర్మాణాలపై రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.
    7. BPS వంటి పథకాల అమలులో అధికారుల బాధ్యతను కూడా చట్టబద్ధంగా నిర్ధారించే విధానాన్ని రూపొందించాలి.
    8. ప్రజలు ఫిర్యాదు చేసిన ప్రతి అక్రమ నిర్మాణంపై నిర్దిష్ట గడువులో విచారణ పూర్తి చేసి, తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారులకు తెలియజేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
    9. టౌన్ ప్లానింగ్ శాఖలో అవినీతి నిరోధక ప్రత్యేక విజిలెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
    10. నిర్మాణ అనుమతి అనంతరం అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి, నిర్మాణం పూర్తయ్యే వరకు చర్యలు తీసుకోకపోతే, సంబంధిత అధికారులపైనా చట్టబద్ధమైన బాధ్యతను నిర్ధారించే విధానాన్ని అమలు చేయాలి.

    ప్రజలు చట్టాన్ని గౌరవిస్తారు. అదే సమయంలో చట్టాన్ని అమలు చేసే వ్యవస్థ కూడా పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని కోరుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలను అరికట్టడమే కాకుండా, అవి జరగడానికి కారణమైన వ్యవస్థాపరమైన లోపాలను సరిదిద్దడం కూడా ప్రభుత్వ బాధ్యత.

    కాబట్టి, పై అంశాలను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సానుకూలంగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున వినమ్రంగా మనవి చేస్తున్నాము.

    ధన్యవాదాలతో,

    భవదీయులు,
    పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ
    పల్నాడు జిల్లా జనతా వారధి టీమ్
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సంబంధించి వినతి పత్రం సమర్పించడం జరిగింది Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top