• ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల నిర్వహణలో నియోజకవర్గ శ్రేణులు బాగా పనిచేస్తారని అధిష్టానానికి మంచి నమ్మకం.
• చిలకలూరిపేట పట్టణ శ్రేణులు ప్రజలకు మరింత చేరువ కావాలి.
• మున్సిపాలిటీలో పార్టీ విజయావకాశాలు మెరుగుపడాలి.
• పట్టణ, నాదెండ్ల మండల టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో శ్రేణులకు ప్రత్తిపాటి దిశానిర్దేశం
ప్రజాసేవే ప్రజా ప్రతినిధుల ప్రధాన కర్తవ్యమని, ప్రభుత్వ పథకాల అమల్లో ప్రజల సంతృప్తి స్థాయి పెంచడంతో పాటు.. ప్రజా సమస్యల పరిష్కారంలో టీడీపీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో పార్టీకి లభించే అపూర్వ విజయమే.. టీడీపీ శ్రేణుల పనితీరుకు కొలమానమని ఆయన స్పష్టం చేశారు.
గురువారం ఆయన పట్టణ మరియు నాదెండ్ల మండల టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో కీలకోపన్యాసం చేశారు. తొలుత స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన పట్టణ పార్టీ శ్రేణుల సమావేశంలో మాట్లాడిన ప్రత్తిపాటి. అనంతరం సంకురాత్రిపాడులో జరిగిన నాదెండ్ల మండల స్థాయి టీడీపీ సమావేశంలో ప్రసంగించారు.
*పట్టణంలో పార్టీ విజయావకాశాలు మెరుగుపడాలి..*
చిలకలూరిపేట పట్టణ పార్టీ శ్రేణులు ప్రజలకు చేరువ అవడంలో వెనుకబడుతున్నారని, గతంలో, ఈ రెండేళ్లలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి చేసినా పార్టీ శ్రేణుల అనైక్యత, వ్యక్తిగత భేషజాల వల్ల ప్రజల ఆదరణ పొందలేకపోతున్నామని ప్రత్తిపాటి పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణంపై పార్టీ శ్రేణులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, బూత్, క్లస్టర్, యూనిట్ ఇన్ ఛార్జులు, కే.ఎస్.ఎస్ లు సమన్వయంతో పనిచేసి, పార్టీ విజయావకాశాలు మెరుగుపరచాలని, ప్రజల్లో మంచి పట్టు సాధించాలని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొనాలని, మొక్కుబడిగా పనిచేసేవారి విషయంలో కఠినంగానే వ్యవహరిస్తామని ప్రత్తిపాటి తేల్చిచెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. తమకు అప్పగించిన బాధ్యతల నిర్వహణలో పార్టీ శ్రేణులు ఎవరికి వారు పోటీపడి మెరుగైన పనితీరు కనబరిచి, పార్టీ అధిష్టానం దృష్టిలో పడాలని ప్రత్తిపాటి సూచించారు. నాదెండ్ల మండల పార్టీ శ్రేణుల పనితీరు ఇంకా మెరుగుపడాలని, మండల..గ్రామస్థాయి నాయకులు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతానికి సమన్వయం, కసితో పనిచేయాలన్నారు. త్వరలో జరిగే పంచాయతీ, ఎంపీపీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని, అప్పుడే కేడర్ పనితీరుకు నిజమైన గుర్తింపు లభిస్తుందని ప్రత్తిపాటి పేర్కొన్నారు.
*నియోజకవర్గ శ్రేణుల పనితీరుకు ప్రత్యేక గుర్తింపు..*
చిలకలూరిపేట టీడీపీ శ్రేణులకు అధిష్టానం దృష్టిలో ప్రత్యేక గుర్తింపు ఉందని, ప్రభుత్వ.. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో సమర్థవంతంగా పనిచేస్తారనే అభిప్రాయం ఉందని ప్రత్తిపాటి తెలిపారు. నియోజకవర్గంలో జరిగిన పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్ని స్వల్ప వ్యవధిలోనూ అధిష్టానం ఊహించిన దానికంటే మిన్నగా ఎన్నోసార్లు విజయవంతం చేశామన్నారు. పట్టణ, నాదెండ్ల మండల పార్టీ సమావేశాల్లో పార్టీ కార్యక్రమాల అమల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ప్రత్తిపాటి ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జార్వార్ ఆడక స్వాములు, సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తేళ్ల సుబ్బారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, టీడీపీ నాయకులు బత్తినేని శ్రీనివాసరావు, షేక్ మస్తాన్ వలి, మద్దిబోయిన శివ, కొత్త కోటేశ్వరరావు, ముల్లా కరిముల్లా, జయప్రసాద్, సౌరెడ్డి, అమరా రమాదేవి, వివిధ హోదాలలో ఉన్న నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి