నెల్లూరు: కాపు సామాజిక వర్గ అభ్యున్నతి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి నెల్లూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నున్న రాధిక తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు చేతుల మీదుగా నున్న రాధిక నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులకు, రాష్ట్ర కమిటీ సభ్యులకు, జాతీయ కమిటీ సభ్యులకు, అలాగే తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన నెల్లూరు నియోజకవర్గ కాపు నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
కాపునాడు సేవా సమితి నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ, సంస్థ చేపట్టే ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటానని నున్న రాధిక పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గ అభివృద్ధి, సంక్షేమం, హక్కుల సాధన కోసం కమిటీ తీసుకునే నిర్ణయాలను తూచా తప్పకుండా అమలు చేస్తానని తెలిపారు.
నెల్లూరు జిల్లాలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని, మహిళలను పెద్ద సంఖ్యలో సంస్థ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తానని నున్న రాధిక వెల్లడించారు.
“కాపుల ఐక్యత, అభ్యున్నతి, సంక్షేమమే లక్ష్యంగా అంకితభావంతో పనిచేస్తాను” అని ఆమె తెలిపారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి