నేషనల్ హైవే (NHAI) 544G పనులను పరిశీలించిన బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్
బాపట్ల: మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌మాల పరియోజన ఫేజ్-1 (Bharatmala Pariyojana Phase-I) పనులను బాపట్ల పార్లమెంట్ సభ్యులు (MP) గారు ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
బెంగళూరు - విజయవాడ ఎకనామిక్ కారిడార్ (NH-544G) లో భాగంగా బాపట్ల పార్లమెంట్ పరిధి కిందకు వచ్చే, కనమరప్పాడు నుండి ముప్పవరం వరకు (Ch. 314+600 to Ch. 343+240) నిర్మిస్తున్న ఆరు వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల పురోగతిని ఎంపీ గారు అడిగి తెలుసుకున్నారు.
ఈ రహదారిలో భాగంగా గుండ్లకమ్మ నదిపై నిర్మిస్తున్న హైవే బ్రిడ్జి పనులను ఎంపీ గారు ప్రత్యక్షంగా సందర్శించి, నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. పనుల పురోగతిని మ్యాపుల ద్వారా మరియు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, పెండింగ్‌లో ఉన్న సాంకేతిక సమస్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ.. ఈ హైవే అందుబాటులోకి వస్తే విజయవాడ మరియు బెంగళూరు మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని, ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. నిర్ణీత కాలపరిమితిలోగా, ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులను పూర్తి చేయాలని అధికారులను మరియు కాంట్రాక్ట్ సంస్థను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో NHAI ఉన్నతాధికారులు, ఇంజనీర్లు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి