వినుకొండ పట్టణం లొ బీజేపీ ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ P V N మాధవ్ గారు మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి సూచనల ప్రకారం మన వినుకొండ పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
జనతా వారధి అనగా ప్రజల నుంచి సమస్యలు సేకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి దాన్ని పరిష్కరించే కార్యక్రమమే ఈ జనతా వారధి .
దీనిలో భాగంగా జరిగిన జనతా వారధి కార్యక్రమం లో భాగంగా గృహ సంపర్కం చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసు కోవడం జరిగినది.
అది వారం ఉదయం బోసు బొమ్మ దగ్గర ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో పూజా కార్యక్రమం పూర్తిచేసుకుని అక్కడి నుండి బొమ్మ మీదగా పప్పు బజార్ వరకు గృహ సంపర్కం చేయడం జరిగింది కార్యక్రమంలో పెన్షన్లు కావాలని, నీళ్లు సమయానికి రావడం లేదని, విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ కొత్తది కావాలని ప్రజలు మన కార్యకర్తల దృష్టికి తీసుకురావడం జరిగింది .
కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి గొడవర్తి సుజాత, పట్టణ మాజీ అధ్యక్షులు ఆడిటర్ రాఘవులు, బండి వెంకటేశ్వర్లు , పట్టణ ఉపాధ్యక్షులు దేసు వెంకట లక్ష్మీనారాయణ, పువ్వాడ అరవింద తదితరులు పాల్గొన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి