(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); స్వర్ణ యుగం లో గ్రామ పంచాయతీ లు, గ్రామీణ ప్రజలు... రాజేంద్రప్రసాద్ - మల్లెలన్యూస్ స్వర్ణ యుగం లో గ్రామ పంచాయతీ లు, గ్రామీణ ప్రజలు... రాజేంద్రప్రసాద్ - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    1, ఏప్రిల్ 2026, బుధవారం

    స్వర్ణ యుగం లో గ్రామ పంచాయతీ లు, గ్రామీణ ప్రజలు... రాజేంద్రప్రసాద్



       *11,800 ల కోట్ల రూపాయలు ఈ 18 నెలల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గార్ల పాలనలో గ్రామ పంచాయితీలకు   నిధులు విడుదల చేయడం జరిగింది. ఇది చారిత్రాత్మకం.... Y. V. B.రాజేంద్రప్రసాద్* 

    *స్వర్ణ యుగం లో గ్రామ పంచాయతీ లు, గ్రామీణ ప్రజలు... రాజేంద్రప్రసాద్* 

    అభివృద్ధితో గ్రామాలు కళకళ లాడుతున్నాయి.... రాజేంద్రప్రసాద్

    ఈరోజు శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం గ్రామపంచాయతీ సర్పంచ్ పిన్నింటి బానోజీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో  ఎమ్మెల్యే శ్రీ ఎన్ ఈశ్వరరావు గారి తో కలిసి ముఖ్యఅతిథిగా  పాల్గొని సిమెంటు రోడ్లను  ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై. వి.బి. రాజేంద్రప్రసాద్ ప్రారంభించినారు_ ..

           ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈశ్వర్ రావు గారి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ  15వ ఆర్థిక సంఘం నిధులు 4600 కోట్ల రూపాయలు మరియు ఉపాధి హామీ నిధులు పల్లె పండుగ 1&2 క్రింద 7 200 కోట్ల రూపాయలు మొత్తం 11, 800 కోట్ల రూపాయలు గ్రామ పంచాయితీలకు ఈ 18 నెలల  పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రజల అవసరాల కోసం  గ్రామపంచాయతీలకు విడుదల చేశారని, ఈ నిధులతో సిమెంట్ రోడ్లు,డ్రైనేజీలు మొదలగు అభివృద్ధి కార్యక్రమాలు 13 200 గ్రామాలలో రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా చేస్తున్నారని రాజేంద్రప్రసాద్   పేర్కొన్నారు.

              ఈ విధంగా గతంలో ఎప్పుడు గ్రామీణ ప్రజలకు ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరగలేదని, ఇది గ్రామపంచాయతీలకు స్వర్ణ యుగమని, ఇది న భూ తో న భవిష్యత్ అని,అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలోని గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయని, గ్రామీణ ప్రజలు సంతోషంగా ఉన్నారని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.

             గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గ్రామ పంచాయతీల నిధులు దారి మళ్ళించి, నిధులను దొంగిలించి  గ్రామాలు అభివృద్ధి చేయకుండా గ్రామీణ ప్రజలను జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని, అందుకనే మా పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సర్పంచులు పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు,ఆందోళనలు, పోరాటాలను చేయడం జరిగిందని ఆ పోరాటాల ఫలితంగా ఇప్పుడు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

                ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈశ్వర్ రావు గారు మాట్లాడుతూ తన ఎచ్చర్ల నియోజకవర్గం లోని 130 గ్రామపంచాయతీలలో పంచాయతీరాజ్ నిధులు  551 కోట్ల రూపాయలు తో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఆ నిధులు కార్యక్రమాల నిర్వహణ  ఆయా గ్రామాల సర్పంచులకే అప్పగించానని, గ్రామాల అభివృద్ధి కోసం రాజేంద్రప్రసాద్ గారు వారి నాయకులు చారిత్రకమైన ఉద్యమాలు చేశారని కొనియాడారు,, భవిష్యత్తులో ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గార్ల సహకారంతో ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని ఈశ్వరరావు  పేర్కొన్నారు.

                   ఈ సందర్భంగా  ఎన్నో పోరాటాలు చేసి వేల కోట్ల రూపాయల నిధులు సాధించిన పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ గారికి  వారి రాష్ట్ర కమిటీ నాయకులకు ఎమ్మెల్యే ఈశ్వర్ గారు మరియు సర్పంచులు శాలువాలు  పూలదండలు తో ఘనంగా సత్కరించినారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఈశ్వరరావు గారిని కూడా సత్కరించినారు.

              ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వినోద్ రాజు,అనేపు రామకృష్ణ నాయుడు ,అనకాపల్లి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు చింతకాయల ముత్యాలు,సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యన్.రజిని ,రాష్ట్ర కార్యదర్శులు రౌతు శ్రీనివాస్,అప్పలనాయుడు విజయనగరం జిల్లా పంచాయితీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు గేదుల రాజా రావు,విజయనగరం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు సోము నాయుడు తదితరులు పాల్గొన్నారు
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: స్వర్ణ యుగం లో గ్రామ పంచాయతీ లు, గ్రామీణ ప్రజలు... రాజేంద్రప్రసాద్ Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top