– అనాధగా మిగిలిన 13 నెలల పసికందు
– నివ్వెర పోయిన వేటపాలెం
_ స్థానికుల కన్నీటి పర్యంతరం బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రావూరుపేట ఆర్యవైశ్య వీధిలో భార్యాభర్తలు ఆత్మహత్యా సంచలనంగా మారింది. బుధవారం మధ్యాహ్నం మాజేటి ప్రభాకర్ (33), పార్వతి (24) ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలు పార్వతి మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ప్రక్క ఇంటి వాళ్లకు పాపను చూడమని అప్పగించినట్లు చెబుతున్నారు. మృతుడు ప్రభాకర్ ఎంబీఏ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడానికి ముందు ప్రభాకర్ అతని సోదరుని మీసేవ కేంద్రానికి వెళ్లి వచ్చినట్లుగా చెబుతున్నారు. మూడున్నర గంటల సమయంలో సోదరుడు సుధాకర్ ఇంటికి వచ్చిన సమయంలో ఒకరు బాత్రూంలో, మరొకరు బెడ్ రూమ్ లో చీరతో ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించి బంధువులకు చెప్పడంతో విషయం బహిర్గతమైంది. సమాచారం తెలుసుకున్న వేటపాలెం పోలీసులు మృత దేహాలను చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతులుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల ఊసే తెలియని 13 నెలల పసిపాప మాన్విత అదమరిచి నిద్రపోతున్న దృశ్యం స్థానికులను కలచివేస్తోంది. ఈనెల 5వ తేదీన మాన్విత మొదటి పుట్టినరోజు నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. భార్యాభర్తల మరణానికి కారణాలు పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి