(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); మిషన్ అమరావతి ఇప్పుడే స్టార్ట్ ! - మల్లెలన్యూస్ మిషన్ అమరావతి ఇప్పుడే స్టార్ట్ ! - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    6, ఏప్రిల్ 2026, సోమవారం

    మిషన్ అమరావతి ఇప్పుడే స్టార్ట్ !




     
     
    మిషన్ అమరావతి ఇప్పుడే స్టార్ట్ !

    తెలుగువారు ఎదుగుతూంటే తెలుగు వారే వెనక్కి లాగేస్తారని సెటైరిక్గా మన గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అదే జరుగుతోంది. హైదరాబాద్ ను కోల్పోయాం.. మన చుట్టూ చెన్నై, బెంగళూరు వంటి నగరాలతో అభివృద్ధి చెందిన రాష్ట్రాలున్నాయి. వాటి మధ్య వ్యవసాయక రాష్ట్రంగా ఏపీ నలిగిపోవాల్సిందేనా?. మనం ఎప్పటికీ ఆయా నగరాలకువలసపోయి బతకాల్సిందేనా ?. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు చంద్రబాబు .. ఆ నగరాల తరహాలో మరో విద్యా, ఉపాధి కేంద్రాన్ని నిర్మించాలనుకున్నారు. చంద్రబాబుకు మొదటి అవకాశం వచ్చింది. కేవలం ఒక పరిపాలనా నగరం మాత్రమే కాదు, రాబోయే తరాలకు ఉపాధినిచ్చే ఒక ఆర్థిక కేంద్రం, విద్యా హబ్ కావాలని చంద్రబాబు ఆశించారు. ప్రపంచస్థాయి నగరాలకు దీటుగా అమరావతిని తీర్చిదిద్దే క్రమంలో ఆయన చేసిన అతిపెద్ద సాహసం భూసమీకరణ . ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, రైతుల నమ్మకమే పెట్టుబడిగా 33 వేల ఎకరాల భూమిని సేకరించడం ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతం. పునాదులు పడ్డాయి, నిర్మాణాలు వేగవంతమయ్యాయి, ప్రపంచ దిగ్గజ సంస్థలు అమరావతి వైపు చూడటం ప్రారంభించాయి. సరిగ్గా అప్పుడే రాష్ట్రంపై జగన్ రెడ్డి అనే ఒక రాజకీయ విపత్తు ముంచుకొచ్చింది.

    జగన్ అనే విపత్తు నుండి చట్టపరమైన రక్షణ

    2019లో అధికార మార్పిడి జరిగిన తర్వాత అమరావతి ఎదుర్కొన్న పరిస్థితులు వర్ణనాతీతం. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. కానీ జగన్ రెడ్డికి మాత్రం ఇల్లు కూల్చి చూడు.. అభివృద్ధిని అడ్డుకుని చూడు అనే సిద్ధాంతం అలవాటైనట్లుంది. రాజధాని కోసం సర్వస్వాన్ని ధారపోసిన రైతులను నడిరోడ్డుపై నిలబెట్టారు. ఐదు సంవత్సరాలు ఓ పీడకల, భూములిచ్చిన రైతులకు నరకం. కేసులు, దాడులు, లాఠీచార్జులు ఇలా చెప్పుకుంటూ పోతే.. రాష్ట్రం కోసం రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఇదా మనం ఇచ్చే గౌరవం అని అందరూ బాధపడ్డారు. కేసులు, దాడులు, లాఠీచార్జులు, మహిళా రైతులపై దౌర్జన్యాలు.. ఇలా ఒకటా రెండా? రాష్ట్రం కోసం త్యాగం చేసిన వారికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా అని నాగరిక సమాజం తలదించుకుంది. అదే రాజధానిని జగన్ రెడ్డి విశాఖలోపెడతానంటే పట్టుమని పది ఎకరాలు ఇచ్చేందుకు ఎవరూ వచ్చేవారు కాదు. చివరికి పులివెందులలో పెడతానన్నా.. భూమీ సమీకరణ చేస్తానన్నా ఎవరూ నమ్మరు. జగన్ రెడ్డికి దోచుకోవడం తప్ప ఏమీతెలియదు. ఐదేళ్లలో అదే చేసి చూపించారు.అందుకేప్రజలు మళ్లీ లెగవకుండా..రాకుండా పాతాళంలోకి పాతి పెట్టారు. అయినా ఏపీని నిను వీడని నేనే అంటూ ఆయన వెంటపడుతున్నారు. జగన్ రెడ్డి మళ్లీ ఎక్కడ వస్తాడోనన్న భయంతో పెట్టుబడిదారులు సందేహం వ్యక్తం చేస్తూంటే… ఆయన రాడు.. రాజధాని మారదు అని గ్యారంటీ కల్పించేందుకు కేంద్రం చట్టబద్ధత కల్పించించింది. అమరావతి రాజధాని విషయంలో పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం కేవలం ఒక చట్టబద్ధమైన ప్రక్రియ మాత్రమే కాదు, అది ఐదు కోట్ల ఆంధ్రుల ఆశల మీద ముంచుకొచ్చిన చీకట్లను చీల్చుతూ వచ్చిన ఒక రాజ్యాంగ కవచం . గత ఐదేళ్లుగా ఒక వ్యవస్థీకృత కుట్రతో, అరాచక పాలనతో రాజధానిని స్మశానంగా మార్చాలని చూసిన శక్తుల పడగనీడ నుంచి అమరావతికి ఇప్పుడు శాశ్వత విముక్తి లభించింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా, అభివృద్ధిని అడ్డుకుంటూ రైతుల త్యాగాలను అపహాస్యం చేసిన రాక్షస ప్రవృత్తికి ఈ చట్టం ఒక గట్టి చెక్ పెట్టింది. ఇకపై ఏ ఒక్క వ్యక్తో, లేదా ఒక పిచ్చి తుగ్లక్ ఆలోచనో అమరావతి ఉనికిని ప్రశ్నార్థకం చేయలేదు. ఈ చారిత్రాత్మక చట్టం అమరావతిని ఒక అజేయమైన కోట గా మార్చింది. ఒక రాజధానిని నిర్మించడం అంటే భవనాలు కట్టడం మాత్రమే కాదు, ప్రజల నమ్మకాన్ని కాపాడటం. గతంలో పునాదులను పెకిలించి, ఆశలను చిదిమేయాలని చూసిన వారికి పార్లమెంట్ సాక్షిగా గట్టి సమాధానం దొరికింది. రాబోయే తరాలకు ఉపాధిని, రాష్ట్రానికి వెలుగును ఇచ్చే ఈ కల్పవృక్షానికి కేంద్రం కల్పించిన చట్టబద్ధమైన రక్షణ, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై పెట్టుబడిదారుల్లో మళ్ళీ భరోసాను నింపుతుంది. ధర్మం వైపు నిలబడి పోరాడిన అమరావతి రైతుల పోరాటానికి ఇది దక్కిన అసలైన గౌరవం , రాక్షస శక్తులపై సాధించిన నైతిక విజయం.

    అమరావతి శాశ్వతమే కానీ అసలు మిషన్ ఇప్పుడే ప్రారంభం !

    ఇప్పుడు అమరావతి శాశ్వతం. మళ్లీ అమరావతిని మార్చాలంటే.. పార్లమెంట్ లోనే చట్టం చేయాలి. అది దాదాపుగా అసాధ్యం. అయితే ఐదు సంవత్సరాల పాటు అమరావతిని స్మశానం చేసిన జగన్ రెడ్డి…. ఇప్పుడు శాశ్వతమైన రాజధాని.. అన్ని రాష్ట్రాలతో కలిసి ధీమాగా నిలబడే రాజధాని నిర్మాణం అవుతున్న దశలో.. చట్టపరమైన రక్షణ వస్తున్న దశలో ఆయన మరో సారి పడగ విప్పారు. మావిగన్ పేరుతో ఓ కొత్త రాజధానిని ప్రతిపాదించారు. ఇప్పటి వరకూ జగన్ రెడ్డి రాజధాని విషయంలో ఎన్ని టర్నులు తీసుకున్నారో చెప్పడం కష్టం. మొదట 30 వేల ఎకరాల్లో రాజధాని అది కూడా రాష్ట్రం మధ్యలో ఉండాలని చెప్పింది ఆయనే. తర్వాత అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానానికి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత మాత్రమే .. కుట్రలు ప్రారంభించారు. ఎక్కడ రాష్ట్రం బాగుపడుతుందో అని ఆయన చేయని దుర్మార్గం లేదు. ఐదు సంవత్సరాల్లో మూడు రాజధానులు అన్నారు.. ఒక్క అడుగు కూడా వేయలేదు. ప్రజలు బుద్ది చెప్పిన తర్వతా కూడా మారలేదు. ఇప్పుడు మావిగన్ పేరుతో కొత్త డ్రామా ప్రారంభించారు. ఆ పేరు వింటేనే జనం అంతా పగలబడినవ్వారు. అది ఆయన స్థాయి. అమరావతి అంటే ఎక్కడా లేనంత అసహ్యం పెంచుకున్న జగన్ రెడ్డి.. అదేదో ఓ కులానికి అంటించుకుని అదే నిజమనుకుంటున్నారు. అమరావతి బడుగుల రాజధాని. అమరావతి నియోజకవర్గం రిజర్వుడు నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. జగన్ రెడ్డి వ్యతిరేకిచే సామాజికవర్గం పది శాతం కూడా ఉండదు. అన్నీ తెలిసినా ఆయన రాజకీయం చేస్తూనే ఉన్నారు.

    జగన్ రెడ్డి లక్ష్యం.. కేవలం రాష్ట్రం ఎదగకూడదనే. ఆయన కుట్ర. రాష్ట్రం ఎదిగితే తన రాజకీయాలు పారవని ఆయన భయం. అందుకే .. నిరక్ష్యరాసులు, రౌడీలు వంటి తన పార్టీ కార్యకర్తలతో ఆయన రాజకీయం చేస్తున్నారు. రాజధానిపై కుట్రలు చేస్తున్నారు. అయితే అన్నీ ప్రజలు తెలుసుకుంటున్నారు. ఆయన ఎన్ని చేసినా.. పక్కగా తరిమికొట్టేందుకు సిద్ధమయ్యారు. పార్లమెంట్ లో ఏపీ రాజధానికి చట్టబద్ధత లభించింది. ఇక భ విష్యత్ లో దాన్ని మార్చలేరు. మళ్లీ మార్చాలంటే పార్లమెంట్ లో చట్టం మార్చాల్సిందే. వైసీపీకి ఆ స్థాయి విజయం ఎప్పటికీ రాదు. అయితే జగన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే.. అమరావతిని అలాగే ఉంచవచ్చు ..కానీ దాన్ని కూల్చడం..నాశనం చేయడం చేయడని గ్యారంటీ లేదు. పునాదులు పడినప్పుడే పెకిలించే ప్రయత్నం చేశాడు.

    మూడేళ్లలో ఓ రూపానికి తీసుకు రావాలి!

    అందుకే జగన్ రెడ్డిని అమరావతి విషయంలోనే కాదు.. ఏ రాజకీయ అంశం విషయంలోనూ నమ్మలేరు. అలా నమ్మిన వాళ్లను నట్టేట ముంచేస్తాడు. ఏపీని నాశనం చేస్తాడు. జగన్ రెడ్డి తనకు ఎం చేసినా నలభై శాతం ఓటు బ్యాంక్ ఉందని నమ్ముతున్నారు. కానీ అదేమి ఆయనకు ఆస్తి కాదని.. ఓటర్లు నిజాలు తెలుసుకున్న రోజున.. కరిగిపోతారని ఆయనకు అర్థం కావడం లేదు. అన్నింటిలాగే జగన్ ఈ నలభై శాతం మందిని టేకిట్ గ్రాటెండ్ గా తీసుకుంటున్నారు. కానీ వారు పులివెందులలోనే కర్రు కాల్చి వాత పెట్టారన్న సంగతిని మర్చిపోయారు. ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత వచ్చింది. అయితే ఇదిగొప్పగా సంబరాలు చేసుకునే సందర్భం కాదు.రాజధాని అమరావతికి లభించిన చట్టబద్ధమైన రక్షణ ఒక మైలురాయి మాత్రమే, కానీ గమ్యం కాదు. రాబోయే మూడేళ్ల కాలాన్ని ఒక మిషన్ లా భావించి, మొదటి దశ నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కేవలం ఇటుకలు, సిమెంట్‌తో భవనాలు కట్టడం మాత్రమే రాజధాని నిర్మాణం అనిపించుకోదు. తమ సర్వస్వాన్ని ధారపోసిన రైతులకు వారు ఆశించిన కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లను సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసి అప్పగించినప్పుడే ఆ త్యాగానికి అసలైన సార్థకత లభిస్తుంది. క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలు మెరుగుపడితేనే, అంతర్జాతీయ సంస్థలు తమ పెట్టుబడులను గ్రౌండ్ చేస్తాయి. అమరావతి కేవలం ఒక పరిపాలనా కేంద్రంగా కాకుండా, లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించే ఒక ఎకనామిక్ ఇంజిన్ గా విరాజిల్లుతుందని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన సమయం ఇది. చట్టపరమైన కవచం లభించినప్పటికీ, అభివృద్ధి నిరోధక శక్తులు తమ కుట్రలను మానుకుంటాయని భావించడం అమాయకత్వమే అవుతుంది. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ, రాష్ట్ర భవిష్యత్తుపై పడగ విప్పేందుకు సిద్ధంగా ఉన్న శక్తుల పట్ల ఏపీ ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. అభివృద్ధిని అడ్డుకునే ఏ చిన్న ప్రయత్నాన్నైనా ప్రజాక్షేత్రంలోనే తిప్పికొట్టాలి. ఎందుకంటే అమరావతి అనేది ఒక నగరం మాత్రమే కాదు, అది మన పిల్లల బంగారు భవిష్యత్తుకు వేసిన బలమైన పునాది.

    అమరావతిని నిర్మించుకోవడం అంటే మన ఉనికిని చాటుకోవడం. కోట్లాది మంది ఆశలు, వేలాది మంది రైతుల నమ్మకంపై నిర్మితమవుతున్న ఈ చైతన్య నగరం, రేపటి తరం ఆంధ్రుడి ఆత్మాభిమానానికి ప్రతీక. ప్రభుత్వం అందించే చట్టపరమైన రక్షణతో పాటు, ప్రజల సామాజిక మద్దతు తోడైతేనే రాజధాని నిర్మాణం నిర్విఘ్నంగా సాగుతుంది. రైతుల త్యాగాలకు అసలైన ప్రతిఫలం అప్పుడు మాత్రమే లభిస్తుంది. ఎప్పుడైతే ఆ నగరం కోట్లాది మందికి ఆశ్రయాన్ని, వేలాది మందికి గౌరవప్రదమైన ఉపాధిని కల్పిస్తుందో, అప్పుడే అమరావతి సంపూర్ణత్వం సాధిస్తుంది. ఈ మహా యజ్ఞంలో ప్రతి ఆంధ్రుడు భాగస్వామి కావాల్సిన చారిత్రక అవసరం ఎంతైనా ఉంది.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మిషన్ అమరావతి ఇప్పుడే స్టార్ట్ ! Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top