(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); వినుకొండలో ఎన్నికల జాబితా శుద్ధి పై సమీక్ష సమావేశం - మల్లెలన్యూస్ వినుకొండలో ఎన్నికల జాబితా శుద్ధి పై సమీక్ష సమావేశం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    8, ఏప్రిల్ 2026, బుధవారం

    వినుకొండలో ఎన్నికల జాబితా శుద్ధి పై సమీక్ష సమావేశం





     
     
    వినుకొండలో ఎన్నికల జాబితా శుద్ధి పై సమీక్ష సమావేశం

    పల్నాడు జిల్లా వినుకొండలో   తహశీల్దారు కార్యాలయంలో ఎన్నికల సంబంధిత ముఖ్య సమావేశం నిర్వహించారు. 99-వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.


    ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని ఏఈఆర్వోలు (AEROs), ఏఆర్వోలు (ARROs) మరియు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల జాబితా శుద్ధి, బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం మరియు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమంపై అధికారులుచర్చించి, పలు సూచనలు జారీ చేశారు.


    ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలను సమావేశంలో వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు.


    భారతీయ జనతా పార్టీ తరఫున పల్నాడు జిల్లా కార్యదర్శి జాన్ బాబు కవలకుంట మరియు పల్నాడు జిల్లా ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు తిలక్ నాయక్ ఈ సమావేశంలో పాల్గొని, ఎన్నికల జాబితా సవరణ మరియు బూత్ స్థాయి కార్యకలాపాలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.


    ఈ సమావేశం ద్వారా ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియను మరింత సమర్థవంతంగా అమలు చేయాలనే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వినుకొండలో ఎన్నికల జాబితా శుద్ధి పై సమీక్ష సమావేశం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top