(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); రామాయణంపై సంచలన వ్యాఖ్యలు.. వివాదంలో నటుడు ప్రకాశ్ రాజ్ - మల్లెలన్యూస్ రామాయణంపై సంచలన వ్యాఖ్యలు.. వివాదంలో నటుడు ప్రకాశ్ రాజ్ - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    17, ఏప్రిల్ 2026, శుక్రవారం

    రామాయణంపై సంచలన వ్యాఖ్యలు.. వివాదంలో నటుడు ప్రకాశ్ రాజ్



    రామాయణంపై సంచలన వ్యాఖ్యలు.. వివాదంలో నటుడు ప్రకాశ్ రాజ్

    వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డ నటుడు ప్రకాశ్ రాజ్ 

    రాముడు ఉత్తరాదివాడని, రావణుడు దక్షిణాది గిరిజనుడని వ్యాఖ్య 

    దేశంలో మారణహోమానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఆరోపణ 

    ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్ర‌హం

    ప్రకాశ్ రాజ్ పై క్రిమినల్ కేసు నమోదైనట్లు వార్తలు
    విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తన వ్యాఖ్యలతో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఓ మీడియా కార్యక్రమంలో ఆయన రామాయణంతో పాటు దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల కారణంగా ఆయనపై క్రిమినల్ కేసు కూడా నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి.  

    అసలేం జరిగిందంటే..!
    ఇటీవల జరిగిన ఓ మీడియా కాంక్లేవ్‌లో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. శ్రీరాముడు ఉత్తర భారతదేశానికి చెందినవాడని, రావణుడు దక్షిణ భారతదేశానికి చెందిన గిరిజనుడని వ్యాఖ్యానించారు. పండ్లు దొంగిలించడం వల్లే వారి మధ్య ఘర్షణ మొదలైందని ఆయన పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే రామాయణం, శ్రీరాముడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల సోషల్ మీడియాలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    అంతటితో ఆగకుండా దేశంలో మత సామరస్యంపైనా ప్రకాశ్ రాజ్ సంచలన ఆరోపణలు చేశారు. "ఈ దేశంలో జరుగుతున్నది మారణహోమానికి సన్నాహం. వారు ముస్లింలను, గిరిజనులను, మైనార్టీలను పూర్తిగా తుడిచిపెట్టాలనుకుంటున్నారు" అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా పెద్ద చర్చకు దారితీశాయి. గతంలో కూడా ప్రకాశ్ రాజ్ పలుమార్లు బీజేపీ ప్రభుత్వ విధానాలను బహిరంగంగా విమర్శిస్తూ వార్తల్లో నిలిచారు. అయితే, ఈసారి మత విశ్వాసాలకు సంబంధించిన సున్నితమైన అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెద్దది చేశాయి.

    ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యల అనంతరం ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయనపై క్రిమినల్ అభియోగాలతో పోలీస్ కేసు నమోదైనట్లు సమాచారం. ఈ కేసులో ఆయన న్యాయపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ప్రకాశ్ రాజ్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రామాయణంపై సంచలన వ్యాఖ్యలు.. వివాదంలో నటుడు ప్రకాశ్ రాజ్ Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top