(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – పల్నాడులో బీజేపీ ‘జనతా వారధి’ కార్యక్రమం". - మల్లెలన్యూస్ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – పల్నాడులో బీజేపీ ‘జనతా వారధి’ కార్యక్రమం". - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    12, జూన్ 2026, శుక్రవారం

    ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – పల్నాడులో బీజేపీ ‘జనతా వారధి’ కార్యక్రమం".



     "ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – పల్నాడులో బీజేపీ ‘జనతా వారధి’ కార్యక్రమం".

    పల్నాడు జిల్లా బీజేపీ కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమం

    నరసరావుపేట, జూన్ 12:

    పల్నాడు జిల్లా నరసరావుపేటలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ‘జనతా వారధి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను స్వీకరించారు.

    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఏలూరు శశికుమార్ హాజరై ప్రజల సమస్యలను తెలుసుకుని వినతిపత్రాలను స్వీకరించారు. అచంపేట మండలం నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.

    ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఏలూరు శశికుమార్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. ‘జనతా వారధి’ కార్యక్రమం ద్వారా ప్రతి సామాన్యుడికి పార్టీ అండగా ఉంటుందని, స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

    కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివనాగేశ్వరరావు, జిల్లా జనతా వారధి కో-కన్వీనర్ గంజార్ల ఆదిలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షుడు ఇత్తడి కిరణ్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అన్నపురెడ్డి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి జె. విశెట్టి బ్రహ్మయ్య, జిల్లా జనతా వారధి మీడియా ఇన్‌చార్జి కోమటి వాసు తదితరులు పాల్గొన్నారు.

    ప్రజల నుంచి వచ్చిన సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చిన అర్జీదారులు తమ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరగా, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని నాయకులు తెలిపారు.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – పల్నాడులో బీజేపీ ‘జనతా వారధి’ కార్యక్రమం". Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top