(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); SADAREM స్లాట్ బుకింగ్ కోసం 21 డిసేబిలిటీలు వాటి వివరణ: - మల్లెలన్యూస్ SADAREM స్లాట్ బుకింగ్ కోసం 21 డిసేబిలిటీలు వాటి వివరణ: - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    7, ఏప్రిల్ 2026, మంగళవారం

    SADAREM స్లాట్ బుకింగ్ కోసం 21 డిసేబిలిటీలు వాటి వివరణ:


    SADAREM స్లాట్ బుకింగ్ కోసం 21 డిసేబిలిటీలు వాటి వివరణ:

    *1. Leprosy Cured person*

    *వివరణ:* కుష్టు వ్యాధి పూర్తిగా నయమైన వాళ్లు. చేతులు లేదా కాళ్లు దెబ్బతిని ఉన్నప్పుడు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.

    *2. Locomotor Disability*

    *వివరణ:* కాళ్లు లేదా చేతులు సరిగా కదలకపోవడం, నడవడంలో సమస్య. పోలియో, అక్సిడెంట్ వల్ల చేతులు కాళ్లు విరిగినప్పుడు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.

    *3. Dwarfism*

    *వివరణ:* ఎత్తు చాలా తక్కువగా ఉండటం (మరుగుజ్జు). ఇది పుట్టుకతోనే వచ్చే సమస్య. నాలుగు అడుగులు లేదా అంతకంటే తక్కువ ఎత్తు ఉన్నవాళ్లు మాత్రమే ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.

    *4. Cerebral palsy*

    *వివరణ:* పుట్టుకతోనే మెదడు సమస్య వల్ల కదలికలు సరిగ్గా ఉండకపోవడం. చేతులు, కాళ్లు వణకడం లేదా బలం లేకపోవడం వంటి సమస్యలు ఉన్నవాళ్లు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.

    *5. Muscular Dystrophy*

    *వివరణ:* కండరాలు నెమ్మదిగా బలం కోల్పోయే వ్యాధి. నడవడం, చేతులు ఎత్తడం ఇబ్బందిగా ఉన్నవాళ్లు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.

    *6. Chronic Neurological conditions*

    *వివరణ:* చాలా కాలం నుంచి నాడీ సమస్యలు (మెదడు లేదా నరాలు దెబ్బతినడం). నడవలేకపోవడం, చేతులు కాళ్లు కదల్చలేని వాళ్లు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.

    *7. Multiple Sclerosis*

    *వివరణ:* నరాలు దెబ్బతిని శరీరం బలం కోల్పోయే వ్యాధి. చూడడం, నడవడం, మాట్లాడడం సమస్యలు ఉన్నవాళ్లు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.

    *8. Parkinson’s disease*

    *వివరణ:* వణకు వచ్చి, చేతులు కాళ్లు కదలడం కష్టం అయ్యే వ్యాధి. చాలా నెమ్మదిగా నడుస్తూ ఇబ్బంది పడేవాళ్లు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.

    *9. Hearing impairment*

    *వివరణ:* చెవులతో సరిగా వినలేకపోవడం. కొంచెం వినడం లేదా పూర్తిగా వినకపోవడం (చెవుడు ఉన్నవాళ్లు) ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.

    *10. Mental illness*

    *వివరణ:* మనసు సమస్యలు (డిప్రెషన్, భయం, మనసు గందరగోళం). రోజువారీ జీవితం సరిగా నడవకపోవడం లేదా ఇబ్బందులు ఉన్నవాళ్లు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.

    *11. Intellectual Disability*

    *వివరణ:*(మంద బుద్ది / బుద్ది మాంధ్యం) తెలివి సాధారణం కంటే తక్కువగా ఉండటం. చదువు, మాట్లాడటం, రోజువారీ పనులు నేర్చుకోవడంలో ఇబ్బందులు ఉన్నవాళ్లు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.

    *12. Blindness*

    *వివరణ:* కంటి చూపు పూర్తిగా లేని వాళ్లు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.

    *13. Low-vision*

    *వివరణ:* కళ్లతో కొంచెం మాత్రమే చూడగలగడం. దూరం లేదా దగ్గర వస్తువులు స్పష్టంగా కనిపించకపోవడం వంటి సమస్యలు ఉన్నవారు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.

    *14. Hemophilia*

    *వివరణ:* రక్తం సరిగా గడ్డ కట్టని వ్యాధి ఉన్నవాళ్లు (చిన్న గాయం అయినా ఎక్కువ రక్తం పోవడం) ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.

    *15. Thalassemia*

    *వివరణ:* శరీరంలో రక్తం తక్కువ అయ్యే వ్యాధి ఉన్నవాళ్లు (ఎప్పుడూ రక్తం ఇవ్వాల్సి ఉంటుంది) ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.

    *16. Sickle cell disease*

    *వివరణ:* రక్త కణాలు వంకరగా మారి నొప్పులు, రక్తం తక్కువ అయ్యే వ్యాధి. చాలా నొప్పి మరియు అలసట వస్తుంది – ఇటువంటి లక్షణాలు ఉన్నవారు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.

    *17. Acid Attack Victims*

    *వివరణ:* ఆసిడ్ దాడి వల్ల ముఖం, శరీరం దెబ్బతినడం. ఆసిడ్ దాడి వల్ల చర్మం, కళ్లు, చేతులు సమస్యలు వచ్చిన వారు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.

    *18. Speech & Language Disability*

    *వివరణ:* మాట్లాడటం లేదా భాష అర్థం కాకపోవడం. మాటలు స్పష్టంగా రాకపోవడం వంటి సమస్య ఉన్నవారు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.

    *19. Specific Learning Disability*

    *వివరణ:* చదవడం రాకపోవడం, రాయడం రాకపోవడం, లెక్కలు నేర్చుకోవడంలో మాత్రమే ప్రత్యేక సమస్య. తెలివి సాధారణంగా ఉంటుంది కానీ చదువు కష్టంగా ఉంటుంది – ఇటువంటి ఇబ్బందులు ఉన్నవారు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.

    *20. Autism spectrum disorder*

    *వివరణ:* ఇతరులతో కలవడం, మాట్లాడడం, ప్రవర్తనలో సమస్య. ఒంటరిగా ఉండాలని అనిపించడం, కొన్ని పనులు రిపీట్ చేయడం వంటి సమస్యలు ఉన్నవారు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.

    *21. Multiple disabilities*

    *వివరణ:* ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉన్నవారు (ఉదా: కళ్లు + చెవులు లేదా కదలిక + మనసు). ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: SADAREM స్లాట్ బుకింగ్ కోసం 21 డిసేబిలిటీలు వాటి వివరణ: Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top