(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నకిలీ టికెట్ల వ్యవహారం బయటపడింది. - మల్లెలన్యూస్ ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నకిలీ టికెట్ల వ్యవహారం బయటపడింది. - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    9, ఏప్రిల్ 2026, గురువారం

    ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నకిలీ టికెట్ల వ్యవహారం బయటపడింది.




    ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నకిలీ టికెట్ల వ్యవహారం బయటపడింది.

    *ఐనంపూడి సాయి జగన్నాథ రాజుతో పాటు మరో 6 మందిని అరెస్ట్*

    దేవస్థానం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్న ఈ కుంభకోణంలో 61 నకిలీ టికెట్లు స్వాధీనం చేసుకున్నారు.

    ఈ కేసులో ప్రధాన నిందితుడు ఐనంపూడి సాయి జగన్నాథ రాజుతో పాటు మరో 6 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో దేవస్థానం అకౌంట్స్ విభాగం కంప్యూటర్ సూపర్వైజర్ ములగాల రమేష్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ముత్యాల నాగ వెంకట సత్య శ్రీనివాసరావు ఉన్నారు.

    నిందితుల వద్ద నుంచి నకిలీ టికెట్లు ముద్రించేందుకు ఉపయోగించిన ల్యాప్‌టాప్, ప్రింటర్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరెవరైనా ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పి శ్రవణ్ కుమార్ అన్నారు .

    ద్వారకా తిరుమల దేవస్థానంలో నకిలీ టికెట్ల వ్యవహారం – కీలక నిందితుల అరెస్టు
    Cr.No.71/2026 U/s 316(5), 318(3), 336(3), 340(2) r/w 3(5) B.N.S & Sec 66, 66(D) IT Act – ద్వారకాతిరుమల PS:
    ముద్దాయిలు:
    A1. ఐనంపూడి సాయి జగన్నాథ రాజు, తండ్రి రమణరాజు, వయస్సు 26 సంవత్సరాలు, కులం క్షత్రియ, ద్వారకాతిరుమల గ్రామం &మండలం (దేవస్థానం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి)
    A2. ములగాల రమేష్, తండ్రి ప్రకాశరావు, వయస్సు 44 సంవత్సరాలు, కులం కాపు, ద్వారకాతిరుమల గ్రామం &మండలం (దేవస్థానం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి)
    A5. తొంటపాక సత్యనారాయణ, తండ్రి కృష్ణ, వయస్సు 45 సంవత్సరాలు, కులం రజక, ద్వారకాతిరుమల గ్రామం &మండలం (దేవస్థానం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి)
    A6. ఉప్పలపాటి శ్రీనివాసు, తండ్రి రాంబాబు, వయస్సు 38 సంవత్సరాలు, కులం కమ్మ, పెరుగు గూడెం గ్రామం, దెందులూరు మండలం (దేవస్థానం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి)
    A7. కీర్తి అశోక్ కుమార్, తండ్రి ప్రసాద్, వయస్సు 24 సంవత్సరాలు, కులం కాపు, కొమ్మర గ్రామం, ద్వారకాతిరుమల మండలం (దేవస్థానం సెక్యూరిటీ గార్డు)
    A8. మానుకొండ ఆంజనేయులు, తండ్రి దుర్గయ్య, వయస్సు 33 సంవత్సరాలు, కులం ఎస్సీ (మాల), కొమ్మర గ్రామం, ద్వారకాతిరుమల మండలం (దేవస్థానం సెక్యూరిటీ సూపర్వైజర్)
    A9. ముత్యాల నాగ వెంకట సత్య శ్రీనివాసరావు, తండ్రి గణపతిరావు, వయస్సు 45 సంవత్సరాలు, కులం కాపు, ఉప్పాకపాడు గ్రామం, ఉంగుటూరు మండలం (సాఫ్ట్వేర్ ఇంజనీర్)

    వివరాలు:
    ది.15.03.2026 తేదీన మధ్యాహ్నం సుమారు 12:00 గంటల సమయంలో ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నకిలీ టికెట్లను కౌంటర్ ద్వారా భక్తులకు విక్రయించినట్లు, రూ.200 విలువ గల 61 నకిలీ టికెట్లు స్వాధీనం చేసినట్లు దేవస్థానం ఈవో శ్రీ భద్రాజీ గారు ఫిర్యాదు చేయగా, ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది.

    ఈ కేసులో ప్రారంభంగా దేవస్థానం టికెట్ కౌంటర్‌లో పనిచేస్తున్న ఐనంపూడి సాయి జగన్నాథ రాజు మరియు సెక్యూరిటీ గార్డు మేక సతీష్‌లపై కేసు నమోదు చేయబడింది. ప్రధాన నిందితుడు సాయి జగన్నాథ రాజు పరారీలో ఉండటంతో, దర్యాప్తు అధికారి భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ P. కృష్ణ గారు, సెక్యూరిటీ గార్డు మేక సతీష్‌తో పాటు సముద్రాల శేషు బాబును అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

    ప్రధాన నిందితుడు పరారీలో ఉండటంతో, ఈ కేసును సవాలుగా తీసుకున్న ఏలూరు జిల్లా SP శ్రీ ప్రతాప్ శివ కిషోర్ గారి ఆదేశాల మేరకు, ఏలూరు DSP శ్రీ D. శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి. భీమడోలు CI శ్రీ P. కృష్ణ గారు, ద్వారకాతిరుమల SI శ్రీ T. సుధీర్ గారు మరియు సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఐనంపూడి సాయి జగన్నాథ రాజుతో పాటు, ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న మరిన్ని ఆరుగురు దేవస్థానం సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.

    దర్యాప్తులో భాగంగా నిందితుడు సాయి జగన్నాథ రాజును విచారించగా, దేవస్థానం అకౌంట్స్ విభాగంలో కంప్యూటర్ సూపర్వైజర్‌గా పనిచేస్తున్న ములగాల రమేష్‌తో కలిసి, రమేష్ స్నేహితుడైన తాడేపల్లిగూడెం కు చెందిన  ముత్యాల నాగ వెంకట సత్య శ్రీనివాసరావు సహకారంతో నకిలీ టికెట్ల సాఫ్ట్వేర్ రూపొందించి, వాటిని ప్రింట్ తీసుకుని కౌంటర్ల ద్వారా భక్తులకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదించినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంలో మరికొంత ఔట్‌సోర్సింగ్ సిబ్బంది మరియు సెక్యూరిటీ సిబ్బంది కూడా పాలుపంచుకున్నట్లు తేలింది.

    దీనితో మొత్తం 7 మంది కీలక నిందితులను ఈ రోజు సాయంత్రం 6:15 గంటలకు అరెస్ట్ చేయబడింది. ఈ కేసులో ఇప్పటికే A3 సముద్రాల శేషుబాబు మరియు A4 మేక సతీష్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.
    నిందితుల వద్ద నుంచి నకిలీ టికెట్లు ముద్రించేందుకు ఉపయోగించిన Dell ల్యాప్‌టాప్, TVS థర్మల్ ప్రింటర్ మరియు 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు

    ఈ కేసులో మరెవరైనా ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిపై కూడా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

    దర్యాప్తు బృందం:
    శ్రీ P. కృష్ణ గారు – సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, భీమడోలు
    శ్రీ T. సుధీర్ గారు – సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ద్వారకాతిరుమల PS
    శ్రీ G. ధర్మరాజు – PC 2013, సర్కిల్ ఆఫీస్ భీమడోలు
    శ్రీ T. లక్ష్మీనారాయణ – PC 2012, ద్వారకాతిరుమల PS
    శ్రీ V.J. ప్రకాష్ బాబు – HG 800, ద్వారకాతిరుమల PS
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నకిలీ టికెట్ల వ్యవహారం బయటపడింది. Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top