(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); ఇరాన్‌కు అమెరికా భారీ షాక్.. హ‌ర్మూజ్‌ జలసంధిలో దిగ్బంధనంతో రోజుకు రూ.4,081 కోట్ల నష్టం? - మల్లెలన్యూస్ ఇరాన్‌కు అమెరికా భారీ షాక్.. హ‌ర్మూజ్‌ జలసంధిలో దిగ్బంధనంతో రోజుకు రూ.4,081 కోట్ల నష్టం? - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    14, ఏప్రిల్ 2026, మంగళవారం

    ఇరాన్‌కు అమెరికా భారీ షాక్.. హ‌ర్మూజ్‌ జలసంధిలో దిగ్బంధనంతో రోజుకు రూ.4,081 కోట్ల నష్టం?



    ఇరాన్‌కు అమెరికా భారీ షాక్.. హ‌ర్మూజ్‌ జలసంధిలో దిగ్బంధనంతో రోజుకు రూ.4,081 కోట్ల నష్టం?

    అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హ‌ర్మూజ్ జలసంధి వద్ద ఉన్న ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించింది. ఈ చర్యతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుందని, రోజుకు 435 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,081 కోట్లు) నష్టం వాటిల్లవచ్చని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం అంచనా వేసింది.

    కాల్పుల విరమణ చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచే ఈ దిగ్బంధనం అమల్లోకి వచ్చిందని ఆయన ప్రకటించారు. ఇరాన్ ప్రధాన ఆదాయ వనరైన చమురు, పెట్రోకెమికల్స్, ఎరువులు, ఆహార పదార్థాల ఎగుమతులను అడ్డుకోవడం ద్వారా ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే ఈ చర్య వెనుక ఉన్న ప్రధాన వ్యూహం. అమెరికా ట్రెజరీ విభాగం మాజీ అధికారి మియాద్ మలేకి అంచనాల ప్రకారం.. ఈ నష్టంలో కేవలం ముడిచమురు, పెట్రోకెమికల్స్ ఎగుమతుల ద్వారానే రోజుకు 276 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లనుంది.

    అయితే, ఈ నష్టం అంచనాలు పలు అంశాలపై ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా దిగ్బంధనం ఎంత పటిష్ఠంగా ఉంటుంది, హ‌ర్మూజ్ జలసంధికి వెలుపల ఉన్న జాస్క్ టెర్మినల్ ద్వారా ఇరాన్ ఎంతమేర చమురును మళ్లించగలదు అనే దానిపై నష్టం తీవ్రత ఆధారపడి ఉంటుంది. కాగా, ఇప్పటికే సముద్ర మార్గంలో ఉన్న 154 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురు నిల్వలు తక్షణ నష్టాన్ని కొంతవరకు తగ్గించగలవని కెప్లర్ సంస్థ పేర్కొంది.

    అమలు అమెరికాకు సవాలేనా?
    ఈ దిగ్బంధనాన్ని అమలు చేయడం అమెరికాకు పెద్ద సవాలుగా మారనుంది. హ‌ర్మూజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన నౌకా మార్గాల్లో ఒకటి. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 20% చమురు ఇటునుంచే రవాణా అవుతుంది. ఇంత భారీ నౌకా రద్దీని నియంత్రించడం కష్టం. మధ్యప్రాచ్యంలో అమెరికాకు చెందిన 16 యుద్ధనౌకలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లో ఒక్కటి కూడా లేదని అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో దిగ్బంధనాన్ని అమలు చేయడం కష్టసాధ్యమని రక్షణ రంగ నిపుణుడు సిద్ధార్థ్ కౌశల్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇరాన్ నుంచి అధికంగా చమురు దిగుమతి చేసుకునే చైనాకు ఇబ్బందులు సృష్టించడం ద్వారా, ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు తమతో చేతులు కలపాలని బీజింగ్‌ను ప్రేరేపించడం కూడా అమెరికా వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. మొత్తంగా అమెరికా దిగ్బంధనాన్ని ప్రకటించినప్పటికీ, దాని ఆచరణ, విజయం మాత్రం అనేక సవాళ్లతో కూడి ఉందని స్పష్టమవుతోంది.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఇరాన్‌కు అమెరికా భారీ షాక్.. హ‌ర్మూజ్‌ జలసంధిలో దిగ్బంధనంతో రోజుకు రూ.4,081 కోట్ల నష్టం? Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top