శావల్యాపురం మండలంలో జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది
కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశ నిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ ,శావల్యాపురం మండల సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు, జనతా వారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండలంలోని కనుమర్లపూడి గ్రామంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గ్రామంలోని సమస్యలపై నాలుగు అర్జీలు ఇవ్వడం జరిగింది ,లంబాడీ డొంక కాల్వపై బ్రిడ్జి నిర్మాణం మంజూరుకై, ఆంజనేయస్వామి గుడి వెనక బజారులో అసంపూర్ణంగా ఉన్నటువంటి సైడ్ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టాలని, బొడ్డు రాయి వెనుక వీధిలో సైడ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని, సంవత్సరం కాలంగా గ్రామంలో ఆగిపోయినటువంటి గ్రామీణ రక్షిత మంచినీటి పథకానికి మరమ్మత్తులు నిర్వహించి త్రాగునీటిని అందించాలని అర్జీలు ఇవ్వడం జరిగింది,వీటి పరిష్కారం కొరకు బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని తెలిపాము కార్యక్రమంలో మణిబాబు పాల్గొన్నారు
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి