(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా డి ఆర్ ఓ గారికి సీనియర్ సిటీజన్స్ సమస్యలు పై వినతిపత్రం ఇవ్వడం జరిగింది. - మల్లెలన్యూస్ మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా డి ఆర్ ఓ గారికి సీనియర్ సిటీజన్స్ సమస్యలు పై వినతిపత్రం ఇవ్వడం జరిగింది. - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    6, ఏప్రిల్ 2026, సోమవారం

    మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా డి ఆర్ ఓ గారికి సీనియర్ సిటీజన్స్ సమస్యలు పై వినతిపత్రం ఇవ్వడం జరిగింది.




    పల్నాడు జిల్లాలో భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న జనతా వారిధి కార్యక్రమంలో భాగంగా, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు శ్రీ PVN మాధవ్ గారి పిలుపు మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి ఆదేశాలతో, పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా డి ఆర్ ఓ  గారికి  సీనియర్ సిటీజన్స్ సమస్యలు పై మరియు ప్రభుత్వ విధానాల పునఃపరిశీలనపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

    ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు , పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు మరియు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


    విషయం:
    కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సీనియర్ సిటిజన్ కార్డులు మరియు “ఆయుష్మాన్ వయో వందన కార్డ్”లను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తప్పనిసరిగా అంగీకరించేలా తగు ఆదేశాలు జారీ చేయవలసినదిగా వృద్ధుల సంక్షేమం పై ఆలోచన చేయవలసిందిగా వినతి.

    భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పౌరులను సర్వ స్పర్శి సర్వ వ్యాప్తి నినాదంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలుస్తున్నారు. పెద్దఎత్తున వృద్ధులను కలిసిన సమయంలో వారి నుంచి వచ్చిన విన్నపములు చాలా ప్రధానమైన అంశములుగా మేము భావిస్తున్నాము 

    భారతదేశంలో వృద్ధ పౌరుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి.

    • 60 సంవత్సరాలు నిండిన వారికి సీనియర్ సిటిజన్ కార్డులు జారీ చేయడం
    • 70 సంవత్సరాలు పైబడిన వారికి సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య భీమా కల్పించే “ఆయుష్మాన్ వయో వందన (PMJAY)” పథకం అమలు చేయడం

    ఇవి వృద్ధులకు ఎంతో ఉపయోగకరమైన పథకాలు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ కార్డులు ఉన్నప్పటికీ వృద్ధ పౌరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీనియర్ సిటిజెన్ కార్డులు కొన్ని జిల్లాల్లో ఇచ్చారు. 

    • బ్యాంకులు, దేవాలయాలు, హాస్పిటల్స్, కోర్టులు వంటి ప్రదేశాల్లో సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
    • ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ అనేక చోట్ల వాటిని గుర్తించడం లేదు.
    • “ఆయుష్మాన్ వయో వందన కార్డు” ఉన్నప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్య సేవలను నిరాకరిస్తున్నాయి.
    దీని వల్ల వృద్ధులు అత్యవసర వైద్య సేవలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
    • కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PMJAY వయో వందన పథకం ప్రకారం 70 సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తికి రూ.5 లక్షల ఆరోగ్య భీమా సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ వర్తింపు, ఆధార్ ఆధారంగా నమోదు, ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన ప్రైవేట్ హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ చికిత్స జరగడం లేదు.

    అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని Go No.49/02.04.2025 ప్రకారం AB PM -JAY కుటుంబాలకు మరియు ఇతర కుటుంబాలకు అందించేలా నిర్ణయించింది. కానీ ఇది సరైన విధంగా అమలు జరగడం లేదు.

    వృద్ధాప్య పెన్షన్ ను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎంతో భాద్యతయితంగా అందచేస్తుంది. ఈ పధకం కొంతవరకు వృద్దులకు ఆశరాగా ఉన్నప్పటికీ పెరుగుతున్న వృద్ధాశ్రమాలు చూస్తుంటే ఆందోళన కలుగుతుంది.

    పై పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వృద్ధ పౌరుల సంక్షేమార్థం క్రింది చర్యలు తీసుకోవలసిందిగా మనవి.

    • రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలకు (బ్యాంకులు, దేవాలయాలు, కోర్టులు, హాస్పిటల్స్)
    సీనియర్ సిటిజన్ కార్డులను తప్పనిసరిగా అంగీకరించేలా ఆదేశాలు జారీ చేయాలి. సీనియర్ సిటిజెన్ కార్డులు అందచేయాలి.

    • అన్ని హాస్పిటల్స్ (ప్రభుత్వ మరియు ప్రైవేట్)
    “ఆయుష్మాన్ వయో వందన కార్డు”ను తప్పనిసరిగా అమలు చేయాలని కఠిన ఆదేశాలు ఇవ్వాలి.

    • ఈ కార్డులను నిరాకరించే సంస్థలపై
    తగిన చర్యలు (penalties) తీసుకునే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలి.

    • జిల్లా స్థాయిలో ప్రత్యేక నోడల్ అధికారులు నియమించి
    వృద్ధులకు సకాలంలో సేవలు అందేలా పర్యవేక్షణ చేయాలి.

    • ప్రజల్లో అవగాహన కల్పించేందుకు
    ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి.

    • పెరుగుతున్న వృద్ధాశ్రమాలపై నిఘా పెంచాలి. అవసరమైన కుటంబాలకు కౌన్సిలింగ్ నిర్వహించే వ్యవస్థ ఉండాలి.

    వృద్ధ పౌరులు సమాజానికి మూలస్తంభాలు. వారి గౌరవం, ఆరోగ్యం, భద్రత ఏలినవారి బాధ్యత.

    వృద్దులు ఒంటరివారు, అనాధలు కాకూడదు. వారి హక్కులు పరిరక్షించడంలో మరియు వారికీ అండగా నిలవడంలో భారతీయ జనతా పార్టీ వారి పక్షాన్న పని చేస్తుంది.

    కాబట్టి పై వినతిని పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ మనవి.

    ఇట్లు 
     *పల్నాడు జిల్లా జనతా వారధి రాష్ట్ర జట్టు*
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా డి ఆర్ ఓ గారికి సీనియర్ సిటీజన్స్ సమస్యలు పై వినతిపత్రం ఇవ్వడం జరిగింది. Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top