(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); కళలను, కవులను ప్రోత్సహించడం, వారిని వెలికితీయడం కూడా ఒక కళే – తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై.వి.బి .రాజేంద్రప్రసాద్. - మల్లెలన్యూస్ కళలను, కవులను ప్రోత్సహించడం, వారిని వెలికితీయడం కూడా ఒక కళే – తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై.వి.బి .రాజేంద్రప్రసాద్. - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    30, ఏప్రిల్ 2026, గురువారం

    కళలను, కవులను ప్రోత్సహించడం, వారిని వెలికితీయడం కూడా ఒక కళే – తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై.వి.బి .రాజేంద్రప్రసాద్.


     
     
    ఉయ్యూరు   మల్లెల న్యూస్ 

     *కళలను, కవులను ప్రోత్సహించడం, వారిని వెలికితీయడం కూడా ఒక కళే – తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై.వి.బి .రాజేంద్రప్రసాద్.* 

     *ఉయ్యూరు లోని శ్రీనివాస గ్రావిటీ విద్యాసంస్థల యాజమాన్యం వారు పరుచూరి శ్రీనివాసరావు, నీలిమ గార్ల, పరుచూరి సేవా సమితి వార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన పరుచూరి రఘుబాబు స్మారక 36 వ అఖిలభారత నాటక పోటీల కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా పాల్గొని కళల గురించి ప్రసంగించిన రాజేంద్రప్రసాద్ గారు.* 

    ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ.... 

    మన సమాజానికి కళలు, కవులు స్ఫూర్తిదాయకమని, కళ అనేది మానవ భావాలను దృశ్యాలుగా, శబ్దాలుగా, శిల్పాలుగా మలిచే సృజనాత్మక ప్రక్రియ అని, కవిత్వం అనేది భాషను ఉపయోగించి భావాలకు అక్షర రూపం ఇచ్చే సాహిత్య కళ అని, ఈ రెండూ అంతఃసౌందర్యాన్ని, మానవ అనుభవాలను వ్యక్తీకరించే మార్గాలే అని, ఈ రెండింటిని ప్రోత్సహించడం కూడా ఒక కళే అని రాజేంద్రప్రసాద్ అన్నారు.

     _అదేవిధంగా పరుచూరి వెంకటేశ్వరరావు గారు, పరుచూరి  గోపాలకృష్ణ గారు మన ఉయ్యూరు నుంచి వెళ్లి గత 3 దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో  రైటర్ గా, కథారచయితలుగా, సంభాషణల రచయితలుగా, నటులుగా, దర్శకులుగా, కవులుగా, నవలా రచయితలుగా మరియు తెలుగు సినిమాల్లో ప్రధానమైన వక్తలుగా రాణించిన జంట రచయిత సోదరులు అయి న పరుచూరి బ్రదర్స్ మన ఊరి వారు అవడం మనమందరం సంతోషించవలసిన విషయమని, వారి తనయుడు స్వర్గీయ రఘుబాబు స్మారకార్థం గత 36 సంవత్సరాలుగా ఈ రాష్ట్రస్థాయి నాటక పోటీలు నిర్వహిస్తూ కళా సేవ చేస్తున్న పరుచూరి బ్రదర్స్ కి అభినందనలు తెలియజేస్తున్నానని  రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు...

    అదేవిధంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని పెట్టినటువంటి పరుచూరి శ్రీనివాస్ రావు, నీలిమ దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నానని రాజేంద్రప్రసాద్ గారు అన్నారు._ 

    ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు, పరుచూరి రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ పరుచూరి వెంకటేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీనివాస విద్యాసంస్థల అధిపతులు పరుచూరి శ్రీనివాసరావు, నీలిమ, ఉయ్యూరు హాస్పిటల్ చైర్మన్ జయదేవ్  మరియు  కవులు, కళాకారులు మొదలగువారు  పాల్గొన్నారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కళలను, కవులను ప్రోత్సహించడం, వారిని వెలికితీయడం కూడా ఒక కళే – తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై.వి.బి .రాజేంద్రప్రసాద్. Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top