(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); నరసరావుపేట భారతీయ జనతాపార్టీ జిల్లా కార్యాలయంలో NDA కూటమి మహిళా నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది - మల్లెలన్యూస్ నరసరావుపేట భారతీయ జనతాపార్టీ జిల్లా కార్యాలయంలో NDA కూటమి మహిళా నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    21, ఏప్రిల్ 2026, మంగళవారం

    నరసరావుపేట భారతీయ జనతాపార్టీ జిల్లా కార్యాలయంలో NDA కూటమి మహిళా నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది




    నరసరావుపేట భారతీయ జనతాపార్టీ జిల్లా కార్యాలయంలో NDA కూటమి మహిళా నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది 

     స్థానిక ప్రకాష్ నగర్ లోని బిజెపి జిల్లా కార్యాలయంలో "ఎన్డీఏ కూటమి మహిళా నాయకుల విలేకరుల సమావేశం" జరిగింది. 
    ఈ విలేకరుల సమావేశంలో మూడు పార్టీలకు చెందిన మహిళా మోర్చా, తెలుగు మహిళ, వీర మహిళలు పాల్గొని వారి గళాన్ని వినిపించారు.
    కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళల పట్ల అత్యంత సానుకూల ధోరణితో 33% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా పార్లమెంటులో బిల్లు తీసుకు వస్తే, దుష్ట కాంగ్రెస్ పార్టీ మరియు ఇండికూటమి మహిళల స్వాభిమానాన్ని కాలరాస్తూ మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం అత్యంత హేయమైన చర్య అని అభివర్ణించారు. బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఊరా సుజాత గారు మాట్లాడుతూ దేశంలోని మహిళలందరికీ మోడీ గారు వరాలు ప్రకటిస్తే, కాంగ్రెస్ పార్టీ ఇండికూటమి ఆ వరాలను అందుకోనీకుండా చేస్తున్నారని మండిపడ్డారు, తెలుగుదేశం పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు కథం నాగజ్యోతి గారు మాట్లాడుతూ ఒకపక్క దేశంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళుతుంటే కాంగ్రెస్ పార్టీ ఇండీ కూటమి మహిళాభ్యుదయాన్ని తుంగలో తొక్కే విధంగా ప్రవర్తిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి కనుమూరి రాజ్యలక్ష్మి గారు మాట్లాడుతూ సునీత విలియమ్స్ కల్పనా చావ్లా లాంటి ఎంతోమంది మహిళాశక్తి అభివృద్ధిపథాన దేశాన్ని ఎంతో ముందుకు తీసుకువెళుతూ ఉంటే దుష్ట కాంగ్రెస్ పార్టీ ఇండీ కూటమి మహిళలను ఎదగనివ్వకుండా మోకాలు అంటుతున్నారని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనసేన వీర మహిళ ఉపాధ్యక్షురాలు జక్కం నిర్మల గారు మాట్లాడుతూ భారతదేశంలో అద్భుత రీతిన NDA ఆధ్వర్యంలో మహిళా శక్తికి 33% రిజర్వేషన్ తో పట్టంకట్టి వారిని చట్టసభలలో కూర్చోబెట్టాలని ఆలోచనకు తూట్లు పొడిచి దేశంలోని మహిళలందరికి తీరని ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరియు ఇండికూటమి అని మండిపడ్డారు.

         కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లెపు కృపారావుగారు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నాభట్ల ఆదిత్య గారు, జిల్లా ఉపాధ్యక్షులు కాటా అంజనారెడ్డి గారు, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి నేరెళ్ల విజయలక్ష్మి గారు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి ఆర్ నాగలక్ష్మి గారు, జనసేన పార్టీ వీర మహిళ దండూరి లక్ష్మి గారు, తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళ పాలడుగు కుమారి గారు, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు చలువారి సరస్వతి గారు, యువ మోర్చా ఉపాధ్యక్షురాలు దేవిశెట్టి సుధారాణి గారు, సంయుక్త కార్యదర్శి చిలకల పద్మప్రియ గారు, చిలకల ప్రియాంక గారు,  రెండవ పట్టణ అధ్యక్షులు అడపా ఫణిభూషణ్ గారు, రూరల్ మండల అధ్యక్షులు పొందుగల వెంకటేశ్వరరావు గారు, సీనియర్ నాయకులు నాగసరపు ఆంజనేయులు గారు, రెండవ పట్టణ ప్రధాన కార్యదర్శి దయిండే కిషోర్ గారు, జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శి ధారా గుప్తా గారు, జిల్లా కార్యాలయ సహాయకులు మిట్ట చిరంజీవి గారు పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నరసరావుపేట భారతీయ జనతాపార్టీ జిల్లా కార్యాలయంలో NDA కూటమి మహిళా నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top