(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); వైసీపీ ఒక 'గొడ్డలి పార్టీ'.. ఎమ్మెల్సీల రాజీనామాల తిరస్కరణపై మర్రి రాజశేఖర్ ఆగ్రహం - మల్లెలన్యూస్ వైసీపీ ఒక 'గొడ్డలి పార్టీ'.. ఎమ్మెల్సీల రాజీనామాల తిరస్కరణపై మర్రి రాజశేఖర్ ఆగ్రహం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    24, ఏప్రిల్ 2026, శుక్రవారం

    వైసీపీ ఒక 'గొడ్డలి పార్టీ'.. ఎమ్మెల్సీల రాజీనామాల తిరస్కరణపై మర్రి రాజశేఖర్ ఆగ్రహం



     
     
    *వైసీపీ ఒక 'గొడ్డలి పార్టీ'.. ఎమ్మెల్సీల రాజీనామాల తిరస్కరణపై మర్రి రాజశేఖర్ ఆగ్రహం*

    చిలకలూరిపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీని *"గొడ్డలి పార్టీ"* గా అభివర్ణించారు. విలువలకు తిలోదకాలిచ్చి, హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శిస్తూ, ఆ పార్టీ అసలు స్వరూపం ఈరోజు తేటతెల్లమైందని మండిపడ్డారు.
    *రాజీనామాలపై చైర్మన్ తీరుపై విమర్శలు*
    తాము స్వచ్ఛందంగా వైసీపీకి రాజీనామా చేసి, ఆమోదం కోసం మండలి చైర్మన్‌కు పత్రాలు సమర్పించినప్పటికీ, వాటిని తిరస్కరించడం అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు.
     
     ఎమ్మెల్సీల రాజీనామాలను చైర్మన్ తిరస్కరించిన విషయాన్ని అధికారికంగా బయటకు చెప్పకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. చైర్మన్ తీసుకున్న ఈ నిర్ణయం నిబంధనలకు మరియు చట్టానికి విరుద్ధంగా ఉందని, స్వచ్ఛందంగా ఇచ్చిన రాజీనామాలను ఆమోదించకపోవడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు.ఈ పరిణామాలన్నీ మాజీ మంత్రి *బొత్స సత్యనారాయణ* కనుసైగల్లోనే జరుగుతున్నాయని, చైర్మన్ స్వతంత్రంగా కాకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయాలు తీసుకుంటున్నారని మర్రి రాజశేఖర్ తీవ్రంగా ఖండించారు.
    ఎవరి ప్రయోజనాల కోసం, ఏ ప్రాతిపదికన తమ రాజీనామాలను తిరస్కరించారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ నుంచి బయటకు రావాలనే తమ నిర్ణయంలో మార్పు లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వైసీపీ ఒక 'గొడ్డలి పార్టీ'.. ఎమ్మెల్సీల రాజీనామాల తిరస్కరణపై మర్రి రాజశేఖర్ ఆగ్రహం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top