*ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు చేపట్టి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించే లక్ష్యంగా మీకోసం కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు*
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు 21 ఫిర్యాదులు
ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్.,గారి ఆదేశాల మేరకు మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు మరియు పోలీస్ అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పోలీస్ అధికారులు ఫిర్యాదిదారులతో ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగ సంబంధిత / ఆన్‌లైన్ మోసాలు, భూ వివాదాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ఫిర్యాదిదారులు స్వేచ్ఛగా విన్నవించారు. ఫిర్యాదిదారుల సమస్యలను సవివరంగా విని, సానుకూలంగా స్పందించిన అధికారులు చట్టపరమైన విధానాల ద్వారా త్వరితగతిన న్యాయం అందిస్తామని భరోసా కల్పించారు.
సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో మాట్లాడించి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మీకోసం కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును సత్వరంగా పరిష్కరించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాలలో కూడా సమర్పించవచ్చని ఎస్పీ గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం సీఐ సుబ్బారావు, గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్, కనిగిరి సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి