(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); మేడం రమేష్ పై హత్యాకు కుట్ర..* - *ఇరువురి పై కేసు నమోదు చేసిన పోలీసులు* - మల్లెలన్యూస్ మేడం రమేష్ పై హత్యాకు కుట్ర..* - *ఇరువురి పై కేసు నమోదు చేసిన పోలీసులు* - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    20, ఏప్రిల్ 2026, సోమవారం

    మేడం రమేష్ పై హత్యాకు కుట్ర..* - *ఇరువురి పై కేసు నమోదు చేసిన పోలీసులు*


     
     
     
    *మేడం రమేష్ పై హత్యాకు కుట్ర..* 
    - *ఇరువురి పై కేసు నమోదు చేసిన పోలీసులు* 

    పల్నాడు జిల్లా,వినుకొండ: సీనియర్ నాయకుడు, వైశ్య ప్రముఖుడు, ప్రముఖ అపరాల వ్యాపారి మేడం రమేష్ పై హత్యకు కుట్ర పన్నారు. కుట్ర గుట్టు రట్టు కావడం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  సోమవారం వినుకొండ పోలీసులు క్రైమ్ నెంబర్ 91/2026, 506-308 సెక్షన్ల క్రింద ఇరువురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వినుకొండ మండలం జాలలపాలెం గ్రామానికి చెందిన గొట్టం గోవిందరాజులు 2020లో లేని భూమిని ఉన్నట్టుగా చూపి అక్రమంగా జగనన్న కాలనీకి ప్రభుత్వానికి అమ్మి సుమారు 90 లక్షలు స్వాహా చేశారు. ఈ అవినీతిని మేడం రమేష్ బయటకు తీసి గత ఏడాది అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అవినీతి నిగ్గు తేలింది. దీనితో కక్ష కట్టిన గొట్టం గోవిందరాజులు, B. వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో కలిసి మేడం రమేష్ హత్యకు కుట్ర పన్ని సుపారి ఇచ్చి హత మార్చే ప్రయత్నం చేశారంటూ, తనకు రక్షణ కల్పించి ప్రాణాలు కాపాడాలంటూ ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీకి మేడం రమేష్ ఫిర్యాదు చేశాడు. దీనిపై వినుకొండ పోలీసులు విచారణ జరపగా కొన్ని వాస్తవాలు వెలుగు చూడడంతో కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు బాధితుడు మేడం రమేష్ తెలిపారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మేడం రమేష్ పై హత్యాకు కుట్ర..* - *ఇరువురి పై కేసు నమోదు చేసిన పోలీసులు* Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top